Ka Paul Comments: అలా జరిగితే నేనే పీఎం..పవన్ సీఎం..కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Ka Paul Comments: తెలుగు రాష్ట్రాల్లో కేఏ పాల్ పేరు తెలియని వారు ఉండరు. నిత్యం తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. గత ఎన్నికల్లోనూ రెండు రాష్ట్రాల్లో తన ప్రభావం చూపించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Written by - Alla Swamy | Last Updated : Jun 6, 2022, 01:52 PM IST
  • కేఏ పాల్ మరో ఆసక్తికర వ్యాఖ్యలు
  • సోషల్‌ మీడియాలో వైరల్‌
  • విపరీతంగా కామెంట్లు పెడుతున్న నెటిజన్లు
Ka Paul Comments: అలా జరిగితే నేనే పీఎం..పవన్ సీఎం..కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Ka Paul Comments: తెలుగు రాష్ట్రాల్లో కేఏ పాల్ పేరు తెలియని వారు ఉండరు. నిత్యం తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. గత ఎన్నికల్లోనూ రెండు రాష్ట్రాల్లో తన ప్రభావం చూపించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు సైతం విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికైనా మీ కామెడీ ఆపండి అంటూ పోస్టులు పెడుతున్నారు. కేఏ పాల్‌ వ్యాఖ్యలను ఎవరూ నమ్మరంటూ రిప్లే ఇస్తున్నారు.

ప్రజా శాంతి పార్టీ స్థాపించిన తర్వాత కేఏ పాల్‌..రాజకీయాల్లో జోరు పెంచారు. ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్‌లపై తనదైన శైలిలో విమర్శలు సంధిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు నీతి, నిజాయితీ ఉంటే ప్రజా శాంతి పార్టీలో చేరాలన్నారు. 42 ఎంపీ సీట్లు గెలిపిస్తే వచ్చే ఎన్నికల్లో తానే ప్రధానమంత్రిని అవుతానని తెలిపారు. ప్రజా శాంతి పార్టీలో పవన్ కళ్యాణ్‌ చేరితే..ఆయనే ఏపీకి సీఎం అవుతారని పేర్కొన్నారు.

ఇప్పుడా వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కేఏ పాల్ కామెడీ చేయొద్దంటూ నెటిజన్లు సైతం ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. గత కొంతకాలంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్, ప్రజాశాంతి పార్టీ చీఫ్‌ కేఏ పాల్‌ ప్రజల్లో ఉంటున్నారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయన్న ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో ఈరెండు పార్టీలు కలిసి పనిచేస్తాయన్న వాదన ఉంది.

Also read: Gym Trainer: కర్రలతో కొట్టి బూట్లతో తన్ని కాలు విరిచేశారు.. జిమ్‌ ట్రైనర్‌పై హైదరాబాద్ పోలీసుల కిరాతకం  

Also read:Minor Gril Gang Rape: చట్టం తని పని తాను చేస్తుంది.. గ్యాంగ్ రేప్ ఘటనపై అసద్ రియాక్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News