Janasena Pawan Kalyan Ex wife Actress Renu Desai Supports BJP Madhavi Latha:  బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు దేశంలో రోజురోజుకు పాపులారీటీ పెరుగుతుంది. ఇప్పటికే ఆమె తన ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పాతబస్తీలో ధీటైన ప్రసంగాలు చేస్తూ.. ఓవైసీ సోదరులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఓల్డ్ సిటీకి ఓవైసీ సోదరులు చేసింది గుడ్డు సున్నా అంటూ ఆమె ఎద్దెవా చేస్తున్నారు. అంతేకాకుండా.. ఆమె తన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటూ, తన ఫాలోయింగ్ పెంచకుంటున్నారు.ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్కూలో ఆమె చేసిన వ్యాఖ్యలతో ఏకంగా దేశ ప్రధాని మోదీ కళ్లలో కూడా పడ్డారు. ఆ షో పట్ల పీఎం మోదీ కూడా ఇంప్రెస్ అయ్యారు. అంతేకాకుండా.. శ్రీరామనవమి శోభాయాత్రలో పాల్గొన్న మాధవీలత.. మసీదు వైపు చూస్తు విల్లువేసిన ఘటన తీవ్ర దుమారంగా మారింది. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. దీనిపై రాజాసింగ్ కూడా ఆమెకు ఫెవర్ గా మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Doctor left surgery: ఆకలేస్తోంది.. మసాల దోశ తినేసి వస్తా.. సర్జరీ మధ్యలో వెళ్లిపోయిన డాక్టర్..


గాలిలో బాణం వేస్తే మసీదువైపు వేసిందని ఎలా అంటారని ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇలా ఆమె తనపట్ల గతంలో వ్యతిరేకంగా మాట్లాడిన రాజాసింగ్ ను కూడా తనకు ఫెవర్ గా మాట్లాడేలా చేసుకున్నారు. ఓల్డ్ సిటీ అంతా తిరుగుతూ కులమతాలకు అతీతంగా ప్రజలతో మాట్లాడుతూ.. తాను ఎంపీగా గెలిస్తే చేయాలనుకుంటున్న మంచి పనులు గురించి వివరిస్తున్నారు. అదే విధంగా.. తాజాగా, ఆమెకు హైదబాద్ లో క్రమంగా మద్దతు పెరుగుతుందని రాజకీయా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 


ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ మాధవీలతను సపోర్టు చేస్తు ఎక్స్ వేదికగా పోస్టులు చేశారు. చాలా రోజులుకు హైదరాబాద్ ఎన్నికల బరిలో బలమైన మహిళను చూశానన్నారు. మాధవీలత ప్రచారం, ఆమె స్పీచ్ లు, ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యమేస్తుందన్నారు. అదే విధంగా.. తన మాటలను రాజకీయం చేయోద్దని, తన మనస్సుకు అన్పించిందని చెప్పానని, దీని కోసం ఎవరిదగ్గర ప్యాకేజీ లాంటివి తీసుకోలేందంటూ రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చుకున్నారు.


Read More: Pune man Quits Job: ఇలాంటి టాక్సిక్ మనుషుల మధ్య పనిచేయలేను.. వైరల్ గా మారిన పూణే యువకుడి లాస్ట్ వర్కింగ్ డే సెలబ్రేషన్స్..


ఇక మరోవైపు రేణు దేశాయ్ మాధవీలతను సపోర్ట్ చేస్తు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎన్నికలలో బరిలో ఉన్న మాధవీలతకు ఇది మరింత బుస్ట్ కల్గించేదిగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఓవైసీ సోదరులు మాత్రం.. మునుపటిలో జోష్ గా ప్రచారంలో పాల్గొంటున్నట్లు కన్పించడంలేదు. అంతేకాకుండా.. తమను అరెస్టు చేస్తారని, జైలులో చంపేందుకు కుట్రలు చేస్తున్నారని పిరికి వాళ్ల మాదిరిగా మాట్లాడుతున్నారు. దీనికి భిన్నంగా మాధవీలత శివంగిలా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter