TRS LEADERS FIGHT: ఎమ్మెల్యే మాగంటి వర్సెస్ బాబా ఫసియుద్దీన్.. జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ లో రచ్చరచ్చ
TRS LEADERS FIGHT: జూబీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ మధ్య వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఫసియుద్దీన్.. కొంత కాలంగా మాగంటిని టార్గెట్ చేస్తున్నారు
TRS LEADERS FIGHT: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు ముదురుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రం ఉండటంతో కొంత కాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ అశించే నేతలు, ప్రస్తుత ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబీహిల్స్ నియోజకవర్గంలో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ మధ్య వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఫసియుద్దీన్.. కొంత కాలంగా మాగంటిని టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఏకంగా కేసుల వరకు వెళ్తోంది. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు కుట్రలకు దిగుతున్నారు. సెప్టెంబర్ 19న పంజాగుట్టలో నిషా అనే మహిళపై జరిగిన దాడి.. ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య పోరాటంలోనే భాగంగానే జరిగిందని తేలడం కారు పార్టీలో కలకలం రేపుతోంది.
సెప్టెంబర్ 19న పంజాగుట్టలో జరిగిన నిషా హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనుచరుడు విజయ్ సింహా తనను వేధించాడని, కత్తితో దాడి చేశాడని నిషా ఆరోపించడం కలకలం రేపింది. అయితే ఈ కేసును సీరియస్ గా తీసుకుని విచారణ జరిపిన పోలీసులు.. దాడి జరిగినట్లు నిషా డ్రామా ఆడినట్లు పోలీసులు తేల్చారు. ఓ ఎమ్మెల్యే అనుచరుడిగా ఉన్న విజయ్ సింహాను ఇరికించడానికి నిషా నాటకాలు ఆడినట్లు నిర్ధారించారు. తాజాగా ఈ కేసు విషయంలో సంచలన విషయాలు చెప్పారు విజయ్ సింహ. నిషాపై హత్యాయత్నం కేసులో పంజాగుట్ట పోలీసులు నిష్పక్షపాతం గా విచారణ జరిపించని చెప్పారు.మొత్తం కుట్రవెనక బొరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ కుట్ర ఉందన్నారు. తన అనుచరుడు నందగోపాల్ ను ముందు పెట్టి ఫసియుద్దీన్ ఇదంతా చేయించాడని ఆరోపించారు.
ఈ కేసుకు సంబంధించి నిషా చెబుతున్నది అవాస్తమని నిరూపించటానికి పోలీసులకు పలు ఆధారాలు ఇచ్చాజు విజయ్ సింహ్. నిశాపై దాడి జరిగిన సమయంలో తాను ఇంట్లోనే ఉన్నారంటూ ఆధారాలు చూపించాడు. బాబా అనుచరుడే నిషా ను హాస్పిటల్ అడ్మిట్ చేయించి బిల్లు కట్టారని.. దానికి సంబంధించిన సాక్షాలు ఉన్నాయన్నారు. తాను గతంలో బాబా దగ్గర పని చేశానని.. కాని అతని చేస్తున్న కబ్జాలపై ప్రశ్నించానని తెలిపారు. అందుకే తనపై కక్ష కట్టి ఈ కుట్ర చేశాడని విజయ్ సింహా ధ్వజమెత్తారు. బాబా ఫసియుద్దీన్ అనుచరుడు సూరజ్ పరారీలో ఉన్నారని.. అతన్ని పట్టుకుంటే చాలా విషయాలు తెలుస్తాయన్నారు. నిషా చేసిన ఆరోపణల వెనుక బాబా ఫసియుద్దీన్ కుట్ర ఉందని విజయ్ సింహా ఆరోపించారు. తనపై కేసు పెట్టేందుకు నిషాకు బాబా 3లక్షలు రూపాయలు ఇచ్చాడని చెప్పాడు.
మరోవైపు బోరబండలో బాబా ఫసియుద్దీన్ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఇంటి ఓనర్ ఖాళీ చేయించడం దుమారం రేపింది. పార్టీ కార్యాలయాన్ని అద్దెకు తీసుకొని ఏడేళ్లుగా అద్దె చెల్లించడం లేదంటూ ఇంటి ఓనర్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఓనర్ గా అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో టీఆర్ఎస్ కార్యాలయాన్ని ఓనర్ ఖాళీ చేయిస్తుండగా అడ్డుకునే ప్రయత్నం చేశారు కార్పోరేటర్ బాబా ఫసియుద్దీన్. పోలీసులు రావడంతో బాబా అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసుల సాయంతో ఇంటి ఓనర్ వారిని టీఆర్ఎస్ ఆఫీసును ఖాళీ చేయించారు.అయితే తాను ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయించడం వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందనే భావనలో ఉన్నారు ఫసియుద్దీన్. ఎమ్మెల్యే అండతోనే ఇంటి ఓనర్ తనకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లాడని మండిపడుతున్నారు. మొత్తంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొన్ని రోజులుగా వరుసగా జరుగుతున్న ఘటనలతో టీఆర్ఎస్ కేడర్ లో గందరగోళం నెలకొంది.
Read also: Munugode Bypoll: మునుగోడులో 12 వేల కొత్త ఓటర్లకు అనుమతి.. హైకోర్టు తీర్పుతో ఎవరికి లాభం?
Read also: Anam Ramnarayana Reddy: సీఎం జగన్ పై ఎమ్మెల్యే ఆనం తిరుగుబాటు? నెల్లూరు వైసీపీలో కలవరం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook