MP Bandi Sanjay: బండి సంజయ్‌కు జాతీయ స్థాయిలో పదవి.. కేంద్ర మంత్రి పదవి లేనట్లేనా..?
BJP National Executive Committee Member Bandi Sanjay: బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. దీంతో ఆయనకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు లేనట్లేనని తెలుస్తోంది. సోము వీర్రాజును కూడా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించారు.
BJP National Executive Committee Member Bandi Sanjay: ఇటీవల నాలుగు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను మార్చిన బీజేపీ.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌తోపాటు ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది. మొత్తం పది మందిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ మాజీ అధ్యక్షుడు సురేశ్ కశ్యప్, బిహార్ మాజీ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్, ఛత్తీస్‌గఢ్ సీనియర్ నేత విష్ణుదేవ్ సాయి, పంజాబ్ మాజీ అధ్యక్షుడు అశ్విని శర్మ, జార్ఖండ్ మాజీ అధ్యక్షుడు దీపక్ ప్రకాష్, రాజస్థాన్ సీనియర్ నాయకుడు కిరోడీ లాల్ మీనా, రాజస్థాన్ మాజీ అధ్యక్షుడు సతీష్ పూనియాలకు బీజేపీ అధిష్టానం జాతీయ కార్యవర్గంలో చోటు కల్పిస్తూ శనివారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. ఏపీలో ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి.. తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షడిగా నియమించగా.. ఏపీలో సోము వీర్రాజు స్థానంలో కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరికి అధ్యక్ష బాధ్యతలు అప్పటించారు బీజేపీ పెద్దలు. అయితే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి బాధ్యతలను తప్పించి.. బండి సంజయ్‌ను తీసుకుంటారని ప్రచారం జరిగింది. కేంద్ర మంత్రి పదవి లేదా జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంటామని బండి సంజయ్‌కు జేపీ నడ్డా హామీ ఇచ్చారు. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా తీసుకోవడంతో బండి సంజయ్‌కు ఇక కేంద్ర మంత్రి పదవిలేనట్లేనని అర్థమవుతోంది. కేంద్ర మంత్రిగా పనిచేస్తునే.. రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు నిర్వహించనున్నారు.
శనివారం వరంగల్‌లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభకు ప్రధాని మోదీ హాజరవ్వగా.. బండి సంజయ్ ఎమోషన్ స్పీచ్ ఇచ్చారు. మోదీని ప్రపంచమే బాస్‌గా గుర్తించిందని అన్నారు. ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ ఈ సభకు రాలేదని ప్రశ్నించారు. అభివృద్ధి చేసేందుకే మోదీ తెలంగాణకు వచ్చారని అన్నారు. తాను మోదీని చూస్తానో లేదో అనుకునేవాడినని.. అలాంటింది మోదీ తన భూజం తట్టారని అంతకన్నా అదృష్టం ఏముందన్నారు. కిషన్ రెడ్డి నేతృత్వంలో కుటుంబ, అవినీతి పాలనను తరిమికొడతామని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Pawan Kalyan: పొత్తులపై పవన్ కళ్యాణ్ యూటర్న్..? తాజా వ్యాఖ్యలతో కొత్త ట్విస్ట్..!
Also Read: Virat Kohli: జిమ్‌లో చెమటలు చిందిస్తున్న విరాట్ కోహ్లీ.. ఆ ఫిట్‌నెస్ ఏంది సామీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి