నేడు పవిత్ర రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా సోదరీమణులు తమ సోదరుడికి అప్యాయంగా రాఖీ కడుతూ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌(KTR)కు ఆయన సోదరి, మాజీ ఎంపీ కవిత(Kavitha) రాఖీ కట్టారు. ప్రగతి భవన్‌కు వెళ్లిన వెళ్లిన కవిత తన సోదరుడు కేటీఆర్‌కు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. COVID19 వ్యాక్సిన్‌లో మరో ముందడుగు


అనంతరం మరో సోదరుడు.. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌కు మాజీ ఎంపీ కవిత రాఖీ కట్టారు. స్వీట్లు తినిపించుకుని ఈ అన్నాచెల్లెళ్లు రాఖీ పండుగ తీయదనాన్ని పంచుకున్నారు. మహిళా నేతలు.. రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే గొంగిడి సునీత, టీఆర్ఎస్ నాయకురాలు గుండు సుధారాణి, తదితరులు మంత్రి కేటీఆర్ చేతికి ఆత్మీయంగా రాఖీ కట్టారు.  అందాల ‘దేశముదురు’ హన్సిక Photos



Gold Price: నేటి బంగారం, వెండి ధరలు