KCR: జీఎస్టీపై ప్రధానికి కేసీఆర్ లేఖ
భారత ప్రధాని నరేంద్ర మోదికి ( PM Modi ) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ లేఖ రాశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదికి ( PM Modi ) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని చెల్లించాలి అని కోరారు. దీని కోసం కేంద్ర రుణాలు తీసుకోవాలి అని.. దాన్ని పూర్తిగా రాష్ట్రాలకు చెల్లించాలి అని లేఖలో కోరారు. దాంతో పాటు పరిహారాన్ని తగ్గించేందుకు తీసుకున్న నిర్ణయం రద్దు చేయాలని ఆయన కోరారు.
జీఎస్టీ ( GST ) బిల్లులు జాతీ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వం సమర్థించింది అని.. ఇందులో నష్టం కలుగుతుందని తెలిసినా దేశం కోసం అని నిర్ణయం తీసుకున్నాం అని లేఖలో రాశారు. భవిష్యత్తు ప్రయోజనాల ఊహించి.. పెట్టుబడులు వస్తాయి అని ఈ నిర్ణయం తీసుకున్నట్టు లేఖలో తెలిపారు. అదే సమయంలో యూపీఏ ప్రభుత్వం సీఎస్టీని రద్దు చేసే టైమ్ లో పరిహారాన్ని చెల్లిస్తాం అన్నారు. దాంతో రాష్ట్రాలు పరిహారాన్ని తిరస్కరించాయి అని.. అయినా జాప్యం జరుగుతోంది అని లేఖలో రాశారు కేసీఆర్ ( KCR ).