Keesara Ex MRO Nagaraju Suicide: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
రూ.1.10 కోట్ల లంచం కేసులో పట్టుబడ్డ కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య (Keesara Ex MRO Nagaraju Committed Suicide) చేసుకున్నాడు. చంచల్ గూడ జైలులో ఆత్మహత్య (Keesara Ex MRO Nagaraju commits Suicide At Chanchalguda Central Jail) చేసుకోవడం కలకలం రేపుతోంది.
లంచం కేసులో పట్టుబడ్డ కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య (Keesara Ex MRO Nagaraju Committed Suicide) చేసుకున్నాడు. జైలులో ఉన్న నాగరాజు ఆత్మహత్య చేసుకోవడం హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. రూ.కోటి 10 లక్షలు లంచం కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇటీవల నాగరాజును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ప్రస్తుతం చంచలగూడ జైలులో ఉన్నాడు. ఈ క్రమంలో నిందితుడు నాగరాజు ఉరి వేసుకుని ఆత్మహత్య (Ex MRO Nagaraju commits Suicide) చేసుకున్నాడు.
నాగరాజు (Keesara Former MRO Nagaraju) మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరికాసేపట్లో పోస్టుమార్టం జరగనుంది. నకిలీ పాసు పుస్తకాల కేసులో నెల రోజులుగా ఏసీబీ అధికారులు మాజీ ఎమ్మార్వో నాగరాజును విచారిస్తున్నారు. రెండోసారి కస్టడీకి సైతం తీసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం సైతం ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు వారసులు ఉండగా 24 ఎకరాల భూమికి అక్రమంగా పాసు పుస్తకాలు ఎలా జారీ చేశారు, ఎందుకు జారీ చేశారని నాగరాజును ఏసీబీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
- Also Read : Hyderabad Rains: ఇళ్లు కూలి 8మంది మృతి
ఓ భూపట్టా విషయంలో ఏకంగా రూ.2 కోట్లకు కీసర ఎమ్మార్వోగా బాలరాజు నాగరాజు డీల్ కుదుర్చుకోవడం సంచలనమైంది. రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. భారీ మొత్తంలో ఎమ్మార్వోలు లంచాలు తీసుకోవడం, నాగరాజు లాంటి ఉదంతాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలోనే తెలంగాణలో నూతన రెవెన్యూ విధానాన్ని టీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టింది.
Also Read : Kavitha: క్వారంటైన్‌లోకి ఎమ్మెల్సీ కవిత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe