హైదరాబాాద్: మహాకూటమిలో తెలంగాణ జన సమితి పార్టీ ప్రాతపై కోదండరాం క్లారీటీ ఇచ్చారు. ఓ ప్రమఖ తెలుగు మీడియా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఉద్యమ ఆకాంక్షల సాధన దిశగా సాగాలంటే తమకు పొత్తులు ప్రధానమే అయినా.. ఆ పొత్తుల కారణంగా పార్టీ భవిష్యత్తును దెబ్బతీసే విధంగా నడచుకోలేమని తేల్చిచెప్పారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ తమ పార్టీ నిర్మాణం పూర్తి అయిందన్న కోదండారం.. 50 నియోజకవర్గాల్లో పార్టీని వేగవంతంగా పటిష్ఠం చేసే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామని వెల్లడించారు. కోదండరాం వ్యాఖ్యలను బట్టి ఆయన మహాకూటమిలో నాల్గు, ఐదు సీట్లతో సర్దుకునే ఆలోచన ఆయనకు లేనట్లు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కోదండరాం నోట నియోజకవర్గాల సంఖ్య బయటికి వచ్చిందంటే.. మహాకూటమిలో ఎక్కువ సంఖ్యలో సీట్లు అడగాలనే ఆలోచనలో తెలంగాణ జన సమితి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందస్తు ఎన్నికలు విఫల ప్రయోగం


అసెంబ్లీ రద్దు చేస్తూ  సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై కోదండరాం స్పందించారు.  అసలు ముందస్తు ఎన్నికలకు వెళ్లడమనేదది విఫల ప్రయోగమన్నారు. సీఎం కేసీఆర్ ఇలాంటి అవివేక వ్యూహమెలా చేశారో అర్ధం కావడం లేదని కోదండరాం ఎద్దేవ చేశారు.  టీఆర్ఎస్ పాలనలో నేతలు జనం గోస వినకుండా తలుపులు బంద్ చేశారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ద్రోహుల నిలయంగా మారిపోయిందన్న భావన ప్రజల్లో ఉందన్నారు. ఉద్యమకారులకు ఉన్న ఆదరణ, గౌరవం టీఆర్ఎస్ నేతలకు లేదని విమర్శించారు.  వాస్తవానికి  ప్రజలకు ఇంకా తెలంగాణ రాలేదు. ఒక్క కేసీఆర్‌కే వచ్చిందన్న భావన చాలా బలంగా ఉందని కోదండరాం వెల్లడించారు.