Groom On Bicycle in Kolhapur: మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా వినూత్న నిరసనలకు ఫేమస్‌గా మారింది. జిల్లాలో నీటి సమస్య నెలకొనడంతో కొద్ది నెలల క్రితం ఓ వరుడు నీటి ట్యాంకర్‌పై ఊరేగింపుతో మంటపం చేరుకున్న విషయం తెలిసిందే. మరో వరుడు పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా సైకిల్‌పై మండపానికి వచ్చాడు. తాజాగా మరో వ్యక్తి కూడా వినూత్నంగా తన నిరసన తెలిపాడు. పెరుగుతున్న ద్రవోల్బణం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్ధేశంతో సైకిల్‌పై ఊరేగింపుగా వెళ్లాడు. వివరాలు ఇలా.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొల్హాపూర్‌లోని డాంగే గలిలో నివసిస్తున్న ప్రవీణ్ డాంగే అనే వ్యక్తి సామాజిక కార్యకర్త. ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఎప్పుడు స్పందిస్తుంటాడు. ఆదివారం తన పెళ్లి సందర్భంగా వినూత్నంగా నిరసన తెలిపాడు. మండపానికి కారులో వెళ్లకుండా సైకిల్‌పై వెళ్లాడు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సామాన్యులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నాడు. 


డీజిల్, పెట్రోల్ ధరలను గురించి కూడా సైకిల్‌పై ప్ల కార్డులు ప్రదర్శించాడు. ప్రవీణ్ సైకిల్‌పై ఊరేగింపుగా వస్తుంటే బ్యాండ్ వాయించారు. అయితే ఈ కొల్లాపూర్ వరుడి ప్రయత్నం ఎంతవరకు సఫలం అవుతుందో చూడాలి మరి. ప్రస్తుతం ప్రవీణ్ నిరసన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 


ఈ ఏడాది జులైలో ఓ వరుడు ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు నీటి సమస్యతో సతమతమవుతున్నారని ఇలానే నిరసన తెలిపాడు. సైకిల్‌పై ఊరేగింపుగా వచ్చి పెళ్లి మండపానికి చేరుకున్నాడు. అంతేకాదు తాగునీటి సమస్య పరిష్కారం అయ్యే వరకు తామిద్దరం హానీమూన్‌కు కూడా వెళ్లమని నూతన వధూవరులు స్పష్టం చేశారు. ఈ నూతన జంట తెలిపిన నిరసనకు పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి. తాజాగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై మరో వరుడు నిరసన తెలిపిన వీడియో వైరల్ అవుతోంది. 


Also Read: Englad Win World Cup: ఫైనల్లో పాక్ చిత్తు.. విశ్వవిజేతగా ఇంగ్లాండ్


Also Read: YSRCP: మంగళగిరిలో వైసీపీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యే ఆర్కే అనుచరుడు టీడీపీలోకి జంప్‌  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి