England Beat By Pakistan in T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్థాన్ చిత్తయింది. ఇంగ్లాండ్ జట్టు రెండోసారి పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బెన్ స్టోక్స్ (52) చివరి వరకు క్రీజ్‌లో ఉండి ఇంగ్లాండ్‌ను విజేతగా నిలిపాడు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో పాక్ బౌలర్లు చివరి వరకు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లాండ్ అభిమానుల సంబురాలు అంబరాన్ని అంటాయి.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ను ఆరంభం నుంచే ఇంగ్లాండ్ బౌలర్లు ఇబ్బంది పెట్టారు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మహ్మాద్ రిజ్వాన్ రిజ్వాన్ (15)ను శ్యామ్ కర్రన్ క్లీన్ బౌల్డ్ చేసి ఇంగ్లాండ్‌కు తొలి బ్రేక్ అందించాడు. ఆ తరువాత మహ్మాద్ హరీస్ (8) విఫలమవ్వగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (32) కాసేపు పోరాడాడు. ఇఫ్తీకార్ అహ్మాద్ కూడా డకౌట్ కావడంతో 12.2 ఓవర్లలో 85 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
షాన్ మసూద్, షాదాబ్ ఖాన్ పాక్ జట్టును ఆదుకున్నారు. ఇద్దరు వికెట్ల పతనాన్ని అడ్డుకోవడమే కాకుండా.. కాస్త వేగంగా పరుగులు చేశారు. పాక్ మళ్లీ పుంజుకుంటున్న సమయంలో మరోసారి శ్యామ్ కర్రన్ దెబ్బతీశాడు. దూకుడుగా ఆడుతున్న షాన్ మసూద్ (28 బంతుల్లో 38)ను వెనక్కి పంపించాడు. తరువాతి ఓవర్లోనే క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో షాదాబ్ ఖాన్ (20) వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మహ్మద్ నవాజ్ (5)ను కూడా శ్యామ్ కర్రన్ ఔట్ చేయడంతో పాక్ భారీ స్కోరు ఆశలకు గండిపడింది. చివరకు 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది.
138 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు మొదటి ఓవర్‌లోనే షాహిన్ అఫ్రిది షాక్ ఇచ్చాడు. భారత్‌తో జరిగిన సెమీ ఫైనల్లో చెలరేగి ఆడిన అలెక్స్ హేల్స్ (1) క్లీన్ బౌల్డ్ చేసి పాక్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఫిలిప్ సాల్ట్ (10) హరీస్ రౌఫ్ ఔట్ చేసి మరో బ్రేక్ ఇచ్చాడు. కాసేపటికే జోస్ బట్లర్ (26)ను కూడా పెవిలియన్‌కు పంపించి పాకిస్థాన్‌ను మళ్లీ రేసులోకి తీసుకువచ్చాడు.
కానీ ఆ తరువాత బెన్ స్టోక్స్ క్రీజ్‌లో పాతుకుపోయి.. హ్యారీ బ్రూక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడించిపించాడు. ఇద్దరు ఎక్కువగా షాట్లకు పోకుండా.. వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. దీంతో ఇంగ్లాండ్ విజయం దిశగా దూసుకెళ్లింది. జట్టు స్కోరు 12.3 ఓవర్లలో 84 పరుగులకు చేరుకున్న సమయంలో బ్రూక్ (20)ను షాదాబ్ ఖాన్ పెవిలియన్‌కు పంపించాడు. ఓ వైపు స్టోక్స్ నిలకడగా ఆడుతుండగా.. మెయిన్ అలీ చక్కటి సహాకారాన్ని అందించాడు.
ఇద్దరు బౌండరీలతో కాస్త దూకుడుగా ఆడడంతో ఇంగ్లాండ్ విజయానికి చేరువైంది. గెలుపునకు మరో ఏడు పరుగులు అవసరమైన దశలో మెయిన్ అలీ (19) ఔట్ అయినా.. స్టోక్స్ (49 బంతుల్లో 52) పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విశ్వవిజేతగా నిలిపాడు. 19వ ఓవర్ చివరి బంతికి ఇంగ్లాండ్ విజయాన్ని అందుకుంది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ రెండు, షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, మహ్మాద్ వసీమ్ తలో వికెట్ తీశారు. 2010 పొట్టి కప్‌ను ముద్దాడిన ఇంగ్లాండ్.. రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది.
Also Read: Delhi MCD Elections: టికెట్ దక్కలేదని టవర్ ఎక్కిన ఆప్ నాయకుడు.. వినూత్న నిరసన
Also Read: Pak Vs Eng Final: పాకిస్థాన్‌ను కట్టడి చేసిన బౌలర్లు.. ఇంగ్లాండ్‌కు ఈజీ టార్గెట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి