KTR Anticipatory Bail: ప్రపంచ ఖ్యాతి పొందిన ఫార్ములా ఈ రేసును హైదరాబాద్‌కు తీసుకువచ్చి విజయవంతంగా నిర్వహించిన అంశంపై అవినీతి నిరోధక శాఖపై కేసు నమోదు చేయడంతో తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌పై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. ఒకటి, రెండు రోజుల్లో అరెస్ట్‌ చేస్తారనే వార్తల నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కేసు నమోదు కావడంతో తాను ముందస్తు బెయిల్‌కు కూడా దరఖాస్తు చేసుకోనని.. ఏం చేస్తారో చేసుకోండి అంటూ సవాల్‌ చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR ACB Case: ఫార్ములా ఈ రేసులో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు.. నేడో రేపో అరెస్ట్‌?


 


అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కేటీఆర్‌ గురువారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారాంతంలో తన అరెస్ట్‌ ఉండవచ్చని పేర్కొన్నారు. మధ్యంతర బెయిల్‌కు కూడా దరఖాస్తు చేసుకోలేనని ప్రకటించారు. అంతకుముందు అసెంబ్లీలో మాట్లాడుతూ.. 'నాపై ఏదో కేసు నమోదు చేశారని ఇప్పుడే మా సభ్యులు చేబుతున్నారు. ప్రస్తుతం సభ నడుస్తున్న సందర్భంగా స్పీకర్‌కు  కోరుతున్నా. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే నిజాలు ప్రజలకు తెలియజేయాలన్న చిత్తశుద్ది ఉంటే చర్చకు సిద్దంగా చర్చ పెట్టాలి' అని సవాల్‌ చేశారు.


Also Read: Pending DAs: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. పెండింగ్‌ డీఏలపై అసెంబ్లీలో చర్చ


రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని సర్కస్‌లా నడుపుతున్నారని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎన్నికల ముందు జిల్లాలను పెంచుతామని కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. రేవంత్‌ రెడ్డి ఏమో జిల్లాలను కుదిస్తానని చెబుతారు.. పొంగులేటి మాత్రం కుదించడం లేదు అంటారు. ఇది ప్రభుత్వమా? సర్కసా?' అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని సర్కస్‌లాగా చేశారు అని కేటీఆర్‌ మండిపడ్డారు. మంత్రివర్గం గాసిప్‌ బ్యాచ్‌గా మారిందని ఆరోపించారు. వాళ్లన్నీ లీకులు ఇస్తున్నారు కానీ అధికారికంగా ఏది చెప్పడం లేదని కేటీఆర్‌ గుర్తుచేశారు. ఫార్ములా ఈ రేసు అంశంపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం బేఖాతరు చేయడంతో మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్ రావు తప్పుబట్టారు. దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు పెట్టాలని సవాల్‌ విసురుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter