Konda Surekha  Liquor Party: తెలంగాణలో మరో పార్టీ తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. గతంలో బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ బావ మరిది ఇంట్లో జరిగిన పార్టీ తీవ్ర రాజకీయ దుమారం రేపగా.. తాజాగా కొండా సురేఖ ఇంట్లో నిర్వహించిన పార్టీ సంచలనంగా మారింది. ఆ పార్టీలో బీర్లు, మందు కూడా ఉందని స్వయంగా సురేఖ చెప్పడంతో వివాదాస్పదమైంది. ఈ పార్టీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత స్పందించారు. ఈ సందర్భంగా ఒక లేఖను విడుదల చేసింది. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది చదవండి: Ram Charan: ముదురుతున్న రామ్ చరణ్ దర్గా వివాదం.. క్షమాపణకు అయ్యప్ప స్వాములు డిమాండ్


'నా కుమార్తె పుట్టినరోజు సందర్భంగా మా అమ్మ కొండా సురేఖ వ్యక్తిగత సిబ్బంది కోరిక మేరకు సంప్రదాయ పద్ధతిలో వారికి విందు ఇచ్చాం. ఆ కార్యక్రమంలో ఎలాంటి అక్రమ పదార్థాలు కానీ.. అక్రమ పూరితమైన మద్యం కానీ లేదు. బహిరంగంగా ఏర్పాటుచేసిందే. కొందరు కుట్రపూరితంగా చేస్తున్న దుష్ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నా' అని కొండా సుస్మితా పటేల్‌ లేఖలో తెలిపారు.

ఇది చదవండి: Street Dog: ముఖ్యమంత్రి, మంత్రులను భయపెట్టిన 'కుక్క'... హెలికాప్టర్‌ ఆలస్యం?


'మా అమ్మతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మా 14 ఏళ్ల పాప పుట్టిన రోజు వేడుకలపై బహిరంగంగానే మాట్లాడుకున్నాం. మా అమ్మ తన భద్రతా సిబ్బందిని ఎంతో ప్రేమిస్తుంటుంది. ఈ క్రమంలో మా పాప బర్త్‌ డే సందర్భంగా ప్రత్యేకంగా విందు ఇచ్చాం. అందులో మద్యం కూడా ఉంది. కుటుంబ పార్టీపై బహిరంగంగానే మాట్లాడుకున్నాం. ఎలాంటి రహాస్యం లేదు. ఎలాంటి దాపరికం లేదు' అని సుస్మితా స్పష్టం చేసింది.


'ఇది రేవ్‌ పార్టీ కాదు. ఈ పార్టీలో ఎలాంటి నిషేధిత వస్తువు వాడలేదు. ఇది కేవలం కుటుంబ పార్టీ. మా అమ్మ, ఆమె సిబ్బంది కుటుంబం మాత్రమే పాల్గొన్న పార్టీ ఇది. మా అమ్మ తన సిబ్బందిని మమ్మల్ని చూసుకున్నట్టుగానే వారిని ఒక కుటుంబంలాగా చూసుకుంటుంది. నాయకత్వం అనేది అధికారం చెలాయించేది కాదు. మనతో నడిచేవాళ్ల బాగోగులను చూసుకోవడం అని మా అమ్మ ఎప్పుడూ చెబుతుండేది' అంటూ సుస్మిత వివరణ ఇచ్చింది. 'అందులో విమర్శించేంత ఏముంది? అని సందేహం వ్యక్తం చేసింది. సుస్మిత విడుదల చేసిన లేఖ సంచలనంగా మారింది.

తీవ్ర విమర్శలు
ఈ లేఖపై బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు విమర్శలు చేస్తున్నారు. 'కేటీఆర్‌ బావమరిది ఇంట్లో జరిగిన కుటుంబ పార్టీ రేవ్‌ పార్టీ. కొండా సురేఖ ఇంట్లో జరిగిన పార్టీ ఫ్యామిలీ పార్టీనా?' అని సందేహం వ్యక్తం చేశారు. 'కుటుంబ పార్టీలను రేవ్‌ పార్టీలు అని విమర్శలు చేసిన కాంగ్రెస్‌ శ్రేణులకు సిగ్గుండాలి' అని బీఆర్‌ఎస్‌  నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎవరి ఇంట్లో వేడుకకు అయినా మద్యం వినియోగం సహజం. కేటీఆర్‌ ఇంట్లో అయినా.. కొండా సురేఖ ఇంట్లో అయినా. అంతదానికి రేవ్‌ పార్టీ అని ప్రచారం చేయడం తప్పు' అని కాంగ్రెస్‌ శ్రేణులకు హితవు పలుకుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter