Lockdown imposed in a village in Sircilla: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల (Omicron cases) సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 14 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 38కి చేరింది. ఒమిక్రాన్ కేసుల పరంగా ప్రస్తుతం మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అటు గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం ఒమిక్రాన్ పట్ల అప్రమత్తంగా  వ్యవహరిస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ గ్రామంలో అక్కడి ప్రజలు సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జిల్లాలోని ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇటీవల దుబాయ్ నుంచి తిరిగొచ్చాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అతనికి కోవిడ్ పరీక్షలు (Covid 19 tests) చేయగా నెగటివ్‌గా నిర్ధారణ అయింది. కానీ గ్రామానికి వచ్చాక స్వల్ప కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో కోవిడ్ టెస్టులు చేయించుకోగా అతనికి పాజిటివ్‌ వచ్చింది. యువకుడి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించగా ఒమిక్రాన్‌గా తేలింది. దీంతో స్థానిక అధికారులు చికిత్స నిమిత్తం అతన్ని హైదరాబాద్‌కు తరలించారు.


ఆ తర్వాత అతని ప్రైమరీ కాంటాక్ట్స్ అయిన తల్లి, సోదరికి కోవిడ్ టెస్టులు చేయగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. అయితే వీరికి సోకింది ఒమిక్రాన్ వేరియంటేనా కాదా అన్నది తేలాల్సి ఉంది. ఆ ఇద్దరితో పాటు ఆ యువకుడితో కాంటాక్ట్ అయిన మరో ఆరుగురు యువకులు ప్రస్తుతం క్వారెంటైన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా గూడెం గ్రామస్తులు గ్రామంలో 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధించుకున్నారు. ఈ 10 రోజులు గ్రామానికి రాకపోకలు ఉండవని తెలిపారు.


ఇప్పటివరకూ విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 9,381 మందికి కోవిడ్ టెస్టులు చేశారు. ఇందులో 63 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్ కోసం పిపంచగా 38 మంది ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. ఒమిక్రాన్ (Omicron) వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ సూచిస్తోంది.


Also Read: Bill Gates: 2022 చివరి నాటికి కొవిడ్ అంతం- అప్పటి వరకు జాగ్రత్త!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి