Netherland Lockdown: ఒమిక్రాన్ తీవ్రత, జనవరి 14 వరకూ లాక్‌డౌన్ విధించిన నెదర్లాండ్

Netherland Lockdown: ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతోంది. ప్రపంచదేశాలు గజగజ వణికిపోతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ నేపధ్యంలో వివిధ దేశాలు లాక్‌డౌన్ దిశగా ఆలోచిస్తుంటే..పరిస్థితి విషమిస్తుండటంతో నెదర్లాండ్స్ కఠినమైన లాక్‌డౌన్ విధించింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 21, 2021, 12:22 PM IST
 Netherland Lockdown: ఒమిక్రాన్ తీవ్రత, జనవరి 14 వరకూ లాక్‌డౌన్ విధించిన నెదర్లాండ్

Netherland Lockdown: ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతోంది. ప్రపంచదేశాలు గజగజ వణికిపోతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ నేపధ్యంలో వివిధ దేశాలు లాక్‌డౌన్ దిశగా ఆలోచిస్తుంటే..పరిస్థితి విషమిస్తుండటంతో నెదర్లాండ్స్ కఠినమైన లాక్‌డౌన్ విధించింది. 

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ అక్కడ క్రిస్మస్ వేడుకలపై ప్రభావం చూపించింది. ఒమిక్రాన్ వేరియంట్ నేపధ్యంలో నెదర్లాండ్స్‌లో లాక్‌డౌన్ విధిస్తూ ఆ దేశ ప్రధాని మార్క్ రూట్ ప్రకటన చేశారు. ఫలితంగా నిత్యావసర మార్కెట్ మినహా మిగిలిన అన్నింటిని మూసివేయాల్సందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ లాక్‌డౌన్ జనవరి 14 వరకూ అమల్లో ఉండనుంది. ఆ తరువాత పరిస్థితిని బట్టి తిరిగి సమీక్షించనున్నారు. లాక్‌డౌన్ సమయంలో పరిహారం చెల్లించాలని హాస్పిటాలిటీ సిబ్బంది డిమాండ్ చేస్తుంటే..ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జిమ్స్‌‌కు మినహాయింపు ఇవ్వాలని జిమ్ యజమానులు కోరుతున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సమయంలో బార్స్ , రెస్టారెంట్స్ మూసివేయడం చాలా బాధాకరమని..తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుందంటున్నారు. అందుకే ప్రభుత్వం పరిహారం దిశగా ఆలోచన చేయాలంటున్నారు. 

ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) ప్రమాదం, ముప్పును దృష్టిలో ఉంచుకుని క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై మరిన్ని కఠినమైన ఆంక్షలు విధించే అవకాశాలున్నాయి. యూకేలో ఒమిక్రాన్ తీవ్రత నేపధ్యంలో యూరోపియన్ దేశాలు కఠిన ఆంక్షలకు సిద్ధమౌతున్నాయి. సెలవుల్లో ప్రయాణాలు చేసేవాళ్లు బూస్టర్ డోసు తీసుకోవడం, మాస్క్ తప్పనిసరిగా ధరించడం చేయాలని అమెరికా ఆరోగ్య సలహాదారుడు ఆంటోనీ ఫాసి సూచిస్తున్నారు. అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ప్రయాణాలు ఒమిక్రాన్ ముప్పును పెంచుతాయంటున్నారు. తొలుత దక్షిణాఫ్రికా, హాంకాంగ్‌లో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా సంక్రమించే వైరస్. ఇప్పటికే ప్రపంచంలో 89 దేశాల్లో విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 

ఈ ప్రమాదకర తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నెదర్లాండ్స్(Netherland Lockdown)ప్రభుత్వం పబ్లిక్ లైఫ్‌ను కట్టడి చేసే దిశగా నిబంధనలు విధించింది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో ఒమిక్రాన్ సంక్రమణ వేగవంతం కాకుండా చర్యలు తీసుకుంటోంది. దేశంలో నిత్యావసర దుకాణాలు మినహా మిగిలినవన్నీ మూసివేయాల్సిందిగా కఠిన ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం జనవరి 14 వరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయి. మరోవైపు యూకేలో ఇప్పచికే 25 వేల ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 

Also read: Omicron symptoms: ముక్కు కారడం, గొంతులో మంటగా ఉందా? అది ఒమిక్రాన్ కావచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News