Bill Gates: కరోనా ఒమిక్రాన్ వేరియంట్‌పై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరికలు (Bill Gates on Omicron variant) చేశారు. దీని కారణంగా ప్రపంచమంతా అత్యంత అధ్వాన్న స్థితిలోకి జారుకునే ప్రమాదముందని ఆందోళన (Omicron scare) వ్యక్తం చేశారు.
ఒమిక్రాన్ వేరియంట్‌పై ఇటీవల వరుస ట్వీట్లు చేసిన బిల్ గేట్స్.. ఈ మహమ్మారి చరిత్రలో ఏ వైరస్‌ను చూడనంత వేగంగా వ్యాపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే తన సన్నిహితుల్లో చాలా మందికి ఈ వేరియంట్ సోకినట్లు వెల్లడించారు. ఈ కారణంగా తన హాలిడే ప్లాన్స్ అన్ని రద్దు చేసుకున్నట్లు వివరించారు.
ఒమిక్రాన్ సోకితే ఆరోగ్యంపై ఎంత తీవ్రమైన ప్రభవం ఉంటుందో చెప్పడం కష్టమని పేర్కొన్నారు బిల్‌గేట్స్. ఈ కారణంగా ఈ వైరస్ గురించి మరింత సమాచారం తెలిసే వరకు మనమంతా అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు (Bill Gates on Omicron precautions) బిల్‌గేట్స్.
ప్రజలంతా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. బూస్టర్ డోసు (Corona vaccine Booster dose) కూడా తీసుకోవాలని సలహా ఇచ్చారు బిల్‌గేట్స్. ప్రస్తుత సమయంలో మాస్కులు ధరించడం, సమూహాలుగా ఏర్పడటకపోవడం, వ్యాక్సిన్ తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలన్నారు.
ప్రపంచంపై ఒమిక్రాన్ ప్రభావం మూడు నెలలకన్నా తక్కువే ఉండొచ్చని అంచనా వేశారు బిల్‌గేట్స్. దశల వారీగా ఒమిక్రాన్ వేరియంట్ 2022 చివరి నాటికి (Corona End by 2022) అంతమవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
There will be more breakthrough cases in people who are vx’d, which sounds concerning but is purely a factor of how many people are vx’d and how fast this variant is spreading. Vaccines are designed to prevent people from getting seriously ill or dying & are doing that well.
— Bill Gates (@BillGates) December 21, 2021
ప్రస్తుతం బయటికెళ్లాలన్నా, ఏదైనా వేడుకలో పాల్గొనాలన్నా కొవిడ్ భయాలు నెలకొంటున్నాయని తెలిపారు బిల్‌గేట్స్. అయితే ఇది ఎల్లవేళల ఉండబోదని ఆయన పేర్కొన్నారు. ఏదో ఓ రోజు మహమ్మారి అంతమవుతుందన్నారు. సంతోషంగా ఒకరినొకరు కలుసుకోవచ్చన్నారు. ఆ సమయం త్వరలోనే రావాలని ఆకాంక్షించారు.
దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సగానికిపైగా దేశాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. ఐరోపాలో దీని తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా యూకేలో కేసులు విపరీతంగా (Omicron in UK) పెరుగుతున్నాయి. ఇటీవల ఆక్కడ ఒక్క రోజులోనే 12 వేలకుపైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి
Also read: Winter drinks: చలికాలంలో వెచ్చదనంతో పాటు ఎనర్జీనిచ్చే బెస్ట్ డ్రింక్స్..
Also read: Cannibalism: ఆ మూఢనమ్మకంతో నరమాంస భక్షణ-అమెరికాలో ఒళ్లు గగుర్పొడిచే కేసు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook