Telangana first to deliver medical supplies via drones : దేశంలో తొలిసారి డ్రోన్‌ల సాయంతో మెడిసిన్స్ పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ కార్యక్రమానికి వికారాబాద్‌ వేదికైంది. మెడిసిన్‌ ఫ్రం స్కై పేరుతో వికారాబాద్‌లో శనివారం ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టారు. సరిగ్గా రవాణా సౌకర్యం లేని అటవీ ప్రాంతాలకు, తండాలకు డ్రోన్‌ల (Drones) ద్వారా మందులు సరఫరా చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డ్రోన్‌లో మెడిసిన్‌ బాక్సులు పెట్టి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదట 3 డ్రోన్లలో మందులు, టీకాలు లోడ్‌ చేశారు. ఆ డ్రోన్లు వికారాబాద్‌ ( Vikarabad) ప్రాంతీయ ఆస్పత్రికి వెళ్లి అక్కడ మందులు డెలివరీ చేసేలా ఆపరేట్‌ చేశారు. కొద్ది సమయంలోనే డ్రోన్లు డెలివరీ చేశాయి. 


Also Read : Gas Cylinder Price: అక్టోబర్‌లో ఆకాశాన్ని అంటనున్న గ్యాస్ ధరలు.. 60% పెరుగుదల


ఎమర్జింగ్‌ టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నాం


కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ (KTR) మాట్లాడుతూ.. సాంకేతిక వినియోగంపై సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడూ ఆరా తీస్తారన్నారు. సామాన్యుడికి ఉపయోగం లేని సాంకేతికత వ్యర్థమని సీఎం తరచూ చెప్తుంటారని కేటీఆర్‌‌ అన్నారు. తెలంగాణలో ఎమర్జింగ్‌ టెక్నాలజీని ఎంతో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అధునాతన టెక్నాలజీతో (Advanced technology) మందులు సరఫరా చేస్తున్నామన్నారు.


అనేక రంగాల్లో డ్రోన్లను వినియోగించవచ్చు


అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా రక్తం, (Blood) మందులు (Medicine)సరఫరా చేస్తామని మంత్రి చెప్పారు. ఆరోగ్య రంగంతో పాట అనేక రంగాల్లో డ్రోన్లను వినియోగించవచ్చని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం కూడా డ్రోన్లు వాడుతోందని చెప్పారు. అమ్మాయిలను వేధించే వాళ్లు డ్రోన్‌ చప్పుళ్లకే హడలెత్తిపోతున్నారన్నారు. మైనింగ్‌ లాంటి అక్రమాలకు పాల్పడే ప్రాంతాలను గుర్తించి డ్రోన్ల (Drones)ద్వారా వాటిని కట్టడి చేయొచ్చని చెప్పారు. ఇక కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డితో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


Also Read : India Corona Update: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా ఉధృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook