Gangrape: తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై గ్యాంగ్‌రేప్ జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన ఈ ఘటన కలవరం రేపుతోంది. పబ్‌కు వెళ్లిన ఓ యువతిపై కొందరు యువకులు అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితుల్ని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 


ఈ ఘటన శనివారం జరిగినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ పరిధిలోని ఓ పబ్‌కు 17 ఏళ్ల యువతి వెళ్లింది. తరువాత ఇంటికి వద్ద డ్రాప్ చేస్తామంటూ కొందరు యువకులు కారులో తీసుకెళ్లి..ఆమెపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి మెడపై గాయాలు గమనించిన తల్లిదండ్రులు నిలదీసేసరికి...జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆ యువతి తండ్రి..పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి పాల్పడిన యువకుల్లో ప్రజా ప్రతినిధుల కొడుకు, మోనిటరింగ్ బోర్డ్ ఛైర్మన్ ఉన్నట్టు సమాచారం. ఆ యువతి మాత్రం ఒకరిపేరే చెప్పగలిగింది. ఆ యువతి చెప్పిన యువకుడు కూడా మైనర్ కావడం విశేషం.


జూబ్లిహిల్స్ పోలీసులుల ఐపీీ సెక్షన్ 354, పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. మైనర్ బాలికకు వైద్య పరీక్షల అనంతరం సెక్షన్ 376 గ్యాంగ్‌రేప్ యాడ్ చేశారు. 


Also read: Bus Fire: కర్ణాటకలో ఘోరం.. బస్సులో మంటలు.. 8 మంది సజీవ దహనం.. మృతులంతా తెలంగాణ వాళ్లే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook