Bus Fire: కర్ణాటకలో ఘోరం.. బస్సులో మంటలు.. 8 మంది సజీవ దహనం.. మృతులంతా తెలంగాణ వాళ్లే..

Bus Fire: విహార యాత్ర విషాదమైంది. ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. కళ్ల ముందే అయినావాళ్లు అగ్నికి ఆహుతయ్యారు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది సజీవ దహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న మిని లారీనీ కర్ణాటక రాష్ట్రంలోని కలుబుర్గి జిల్లా కమలాపురలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.

Written by - Srisailam | Last Updated : Jun 3, 2022, 12:36 PM IST
  • కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
  • బస్సులో మంటలు.. 8 మంది సజీవ దహనం
  • మృతులంతా తెలంగాణ వాళ్లే
Bus Fire: కర్ణాటకలో ఘోరం.. బస్సులో మంటలు.. 8 మంది సజీవ దహనం.. మృతులంతా తెలంగాణ వాళ్లే..

Bus Fire: విహార యాత్ర విషాదమైంది. ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. కళ్ల ముందే అయినావాళ్లు అగ్నికి ఆహుతయ్యారు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది సజీవ దహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న మిని లారీనీ కర్ణాటక రాష్ట్రంలోని కలుబుర్గి జిల్లా కమలాపురలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. తర్వాత బోల్తా పడింది. ప్రమాదంలో బస్సుకు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో బస్సు తగలబడింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వాళ్లను సమీప హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.

ప్రమాద సమయంలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో డ్రైవర్ తో పాటు మరో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతులంతా తెలంగాణ వాళ్లే. హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అర్జున్‌.. గోవాలో తన కూతురు పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఇందుకోసం కుటుంబ సభ్యులను ట్రావెల్స్ బస్సులో గోవా తీసుకెళ్లారు. మే29న వీళ్లంతా గోవా వెళ్లారు. పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసి.. తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘోరం జరిగింది.

మిని లారీని డీకొట్టిన తర్వాత బస్సు బోల్తా పడింది. వెంటనే మంటలు అంటుకున్నాయి. వేగంగా విస్తరించాయి.  బస్సులో ఉన్న ప్రయాణికులు దిగే లోపే బస్సును పూర్తిగా ఆక్రమించాయి బస్సులు.  మంటల్లో చిక్కుకుని ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. కేకలు వేస్తూనే మంటల్లో బుగ్గయ్యారు. స్పాట్ లోనే ముగ్గురు చనిపోయారు . హాస్పిటల్ తరలిస్తిండగా మరో ముగ్గురు మృతి చెందారు.  చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు వదిలారు. నిమిషాల్లోనే మహా ఘోరం జరిగిపోయింది. అంతా చూస్తండగానే బస్సు  భస్మమైపోయింది.తమ కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నా ఏం చేయలేక చూస్తుండిపోయారు బస్సులోని మిగితా ప్రయాణికులు.

కర్ణాటక లో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన బాధాకరమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తలసాని హామీ ఇచ్చారు.

READ ALSO: Charminar Bhagya Laxmi Temple: చార్మీనార్ భాగ్యలక్ష్మి ఆలయానికి కాంగ్రెస్ నేతలు.. పాతబస్తీలో హై టెన్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News