Minister Eatala Rajender press meet: హైదరాబాద్: మంత్రి ఈటల రాజేందర్ తనపై వస్తోన్న భూ కబ్జా ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. శుక్రవారం సాయంత్రం నుంచి మీడియాలో తనపై వస్తున్న వరుస కథనాలను మంత్రి ఈటల రాజేందర్ తిప్పికొట్టారు. అధికారిక పార్టీకి అనుకూలమైన ఛానెల్స్‌గా ముద్రపడిన మీడియాలోనూ మంత్రి ఈటల రాజేందర్‌కి వ్యతిరేక కథనాలు రావడం ఆయన కేబినెట్ పదవి గల్లంతేననే కథనాలకు మరింత బలం చేకూర్చినట్టయింది. దీంతో తనపై వస్తున్న వార్తా కథనాలపై మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక్క సిట్టింగ్‌లోనే వందల కోట్లు, వేల కోట్లు సంపాదించే వారు ఎందరో ఉన్నారు. కానీ తనకు మాత్రం వారిలా చేతికి వాచి, రేమండ్ గ్లాస్‌లు పెట్టుకునే అలవాట్లు లేవని అన్నారు. తనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. రాష్ట్రం, దేశంలో ఎన్ని విచారణ సంస్థలు ఉంటే అన్ని సంస్థలతో దర్యాప్తు చేయించాలి. ఆ విచారణలో తాను ఎక్కడైనా ఒక్క ఎకరం కబ్జా చేసినట్టు తేలినా.. తాను ఏ శిక్షకైనా సిద్ధమే అని ఈటల రాజేందర్ తన రాజకీయ ప్రత్యర్థులకు సవాలు విసిరారు. 


ఆనాడు ఏడుగురం ఉన్నప్పుడే ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన వ్యక్తిని. నయిమ్ గ్యాంగ్ బెదిరింపులకే భయపడలేదు. ఎవరో వచ్చి ఏదో అంటే భయపడే మనిషిని కాదు అని చెబుతూ మంత్రి ఈటల రాజేందర్ ఉద్వేగానికి గురయ్యారు. స్వావలంబన కంటే, ఆత్మగౌరవం తనకు మంత్రి పదవి గొప్పది కాదు. బీసీ బిడ్డగా పుట్టాను. కానీ నా భార్య రెడ్డి (Minister Eatala Rajender's wife). అందుకే నా పిల్లలకు రెడ్డి అని పేరు పెట్టుకుంది. దానిపై కూడా విమర్శలు చేస్తున్నారంటే ఇందులో దాగి ఉన్న కుట్ర ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందులో భాగంగానే ముందస్తు ప్రణాళిక ప్రకారం నా మీద కట్టుకథలు అల్లారని అర్థమవుతోంది. కానీ నేను ఎప్పటికీ ముదిరాజ్ బిడ్డనే. ఒక బీసీగా సావనన్నా సస్తాను కానీ ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 


తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నంలో తన ప్రత్యర్థులపై పేరు ఎత్తకుండానే తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మంత్రి ఈటల రాజేందర్ (Minister Eatala Rajender).. ఎవరి చరిత్ర ఏందో తనకు తెలుసునని. కానీ నోరు విప్పను అని అన్నారు. తాను వాళ్లలా కాదు.. కష్టపడి కోళ్ల ఫారాల బిజినెస్ చేసుకుంటూ పైకి వచ్చినోడిని. నాపైనే బురద చల్లేందుకు కుట్ర చేస్తారా అని మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.


Also read : Eatala Rajender: ఈటల రాజేందర్ మంత్రి పదవిపై వార్తా కథనాలు


Also read : COVID-19 test నకిలీ రిపోర్ట్స్ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్


Also read : COVID-19 Cases: తెలంగాణలో నైట్ కర్ఫ్యూలోనూ తగ్గని కరోనా పాజిటివ్ కేసులు, తాజాగా 53 మంది మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook