Eatala Rajender: ఈటల రాజేందర్ మంత్రి పదవిపై వార్తా కథనాలు

Eatala Rajender's minister post: హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ను కేబినెట్​ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. మెదక్​ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో సుమారు 100 ఎకరాల భూమిని మంత్రి ఈటల రాజేందర్ కబ్జా (Land encroachments) చేశారనేది ఆయనపై వస్తున్న ఆరోపణలు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2021, 04:13 AM IST
Eatala Rajender: ఈటల రాజేందర్ మంత్రి పదవిపై వార్తా కథనాలు

Eatala Rajender's minister post: హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ను కేబినెట్​ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. మెదక్​ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో సుమారు 100 ఎకరాల భూమిని మంత్రి ఈటల రాజేందర్ కబ్జా (Land encroachments) చేశారనేది ఆయనపై వస్తున్న ఆరోపణలు. దాదాపు నాలుగున్నరేళ్ల కిందటే ఈ గోల్‌మాల్ జరిగిందని, ఇందులో మంత్రి ఈటల ప్రమేయం ఉందని నిర్ధారిస్తూ అప్పటి కలెక్టర్​గా ఉన్న ధర్మారెడ్డి సీఎం కేసీఆర్​కు నివేదిక అందజేశారని, ఆ ఫైలు ఆధారంగానే మంత్రి ఈటల రాజేందర్‌పై వేటుకు రంగం సిద్ధం అవుతోందనేది ఆ వార్తల సారాంశం.

ఇప్పుడే తెరపైకి రావడానికి కారణం ?
ఈటల రాజేందర్ కబ్జా చేసినట్టుగా చెబుతున్న భూమికి ఇటీవలే రోడ్డు వేసే విషయంలో కొంతమంది స్థానిక రైతులు వ్యతిరేకించిన నేపథ్యంలోనే ఈ కబ్జా (Land kabja) వ్యవహారం బయటకు పొక్కిందని, ఆ తర్వాతే సీఎం కేసీఆర్ అప్పటి జిల్లా కలెక్టర్ ధర్మా రెడ్డి సహాయంతో ఆ ఫైలు తెప్పించుకున్నారనేది మంత్రి ఈటల రాజేందర్‌కి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం​. అందుకే ఇక మంత్రి ఈటల రాజేందర్ మాజీ మంత్రి అయ్యేందుకు ఎంతో దూరం లేదనేది ఆ ప్రచారం సారాంశం.

Also read : COVID-19 test నకిలీ రిపోర్ట్స్ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

ఇదిలావుంటే, గతంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్యపై వేటు వేయాల్సి వచ్చిన సందర్భంలోనూ తన ప్రభుత్వంపై, తన వైఖరిపై ఎన్ని విమర్శలు వచ్చినా సీఎం కేసీఆర్ లెక్కచేయలేదనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ (Minister Eetela Rajender) మంత్రి పదవిపై వస్తున్న వార్తలు మీడియాలో చర్చనియాంశమయ్యాయి.

Also read : Anchor Shyamala: తన భర్త నరసింహా రెడ్డిపై చీటింగ్ కేసులో వీడియో విడుదల చేసిన యాంకర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News