COVID-19 Cases: తెలంగాణలో నైట్ కర్ఫ్యూలోనూ తగ్గని కరోనా పాజిటివ్ కేసులు, తాజాగా 53 మంది మృతి

 కరోనా వైరస్ సెకండ్ వేవ్‌ ప్రభావం అధికంగా ఉంటుంది. కరోనా వ్యాక్సినేషన్ భారీగా జరుగుతున్నా, వైరస్‌లో చోటుచేసుకుంటున్న మార్పులతో తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 7,646 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,35,606కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 30, 2021, 11:20 AM IST
  • తెలంగాణలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి తీవ్రత
  • నైట్ కర్ఫూ అమలు చేస్తున్నా కనిపించని ప్రయోజనం
  • రాష్ట్రంలో తాజాగా 7,646 పాజిటివ్ కేసులు నమోదు, 53 మంది మృతి
COVID-19 Cases: తెలంగాణలో నైట్ కర్ఫ్యూలోనూ తగ్గని కరోనా పాజిటివ్ కేసులు, తాజాగా 53 మంది మృతి

Telangana COVID-19 Cases: కరోనా వైరస్ సెకండ్ వేవ్‌ ప్రభావం అధికంగా ఉంటుంది. కరోనా వ్యాక్సినేషన్ భారీగా జరుగుతున్నా, వైరస్‌లో చోటుచేసుకుంటున్న మార్పులతో తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 7,646 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,35,606కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం రాత్రి 8 వరకు గడిచిన 24 గంటల్లో 77,091 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 7 వేల 6 వందల 46 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షల 35 వేల 6 వందల 6కు చేరింది. కరోనా బారిన పడి రాష్ట్రంలో తాజాగా 53 మంది మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా మరణాలు 2,261కి చేరింది. 

Also Read; 7th Pay Commission: 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు Travel Allowanceపై లేటెస్ట్ అప్‌డేట్

జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ పరిధిలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజా కేసులలో GHMC పరిధిలోనే 1,441 కరోనా కేసులు నమోదు కావడంతో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. తాజా కేసులతో కలిపితే తెలంగాణలో ప్రస్తుతం 77 వేల 727 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 1.29 కోట్ల శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా బారి నుంచి కోలుకుంటున్న వారు 81.71 శాతం ఉన్నారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజు చికిత్స అనంతరం కోవిడ్-19 బారి నుంచి 4,009 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,55,618 మంది కరోనా మహమ్మారిని జయించారు. 

Also Read: Covid-19 Vaccination: కరోనా వ్యాక్సిన్‌పై మరో ఆసక్తికర విషయం వెల్లడించిన నిపుణులు

మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరూ కరోనా టీకాలు తీసుకునేందుకు అర్హులు కానున్నారు. దీంతో 45 ఏళ్లు పైబడిన వారు టీకాలు తీసుకునేందుకు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల కరోనా టెస్టులు చేయడానికి తగినన్ని కిట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనుక భౌతిక దూరం పాటించాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్19 నిబంధనలు పాటించడం, కరోనా టీకాలు తీసుకోవడం ద్వారా కరోనాను తరిమేయాలని సూచిస్తున్నారు.

Also Read: Co-Win Registration: కరోనా టీకాలకు రిజిస్ట్రేషన్ ఎక్కడెక్కడ చేసుకోవాలో తెలుసా 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News