Gangula Kamalakar: పదవులు పట్టుకుని వేలాడుతున్నది నువ్వే బిడ్డా.. ఈటల రాజేందర్‌కు కౌంటర్ అటాక్
Gangula Kamalakar vs Eatala Rajender: ఈటల ఆరోపణలు, విమర్శలకు మంత్రి గంగుల కమలాకర్ వెంటనే కౌంటర్ అటాక్ ఇచ్చారు. తాను కూడా బీసీ బిడ్డనేనంటూ గంగుల మీసం మెలి వేయడం గమనార్హం. మరోసారి బిడ్డ అనే పదం వాడితే మంచిగా ఉండదు, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై తెలంగాణ వైద్యశాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేటి ఉదయం హుజురాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ పౌల్ట్రీ ఫామ్, గోడౌన్స్ సీజన్ చేశారని, కానీ తన ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని వ్యాఖ్యానించారు. ఈటల ఆరోపణలు, విమర్శలకు మంత్రి గంగుల కమలాకర్ వెంటనే కౌంటర్ అటాక్ ఇచ్చారు. తాను కూడా బీసీ బిడ్డనేనంటూ గంగుల మీసం మెలి వేయడం గమనార్హం.
కరీంగనర్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మాజీ మంత్రి ఈటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి బిడ్డ అనే పదం వాడితే మంచిగా ఉండదు, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారు. ఈటల రాజేందర్ కన్నా తనకు ఎక్కువ ఆత్మగౌరవం ఉందన్నారు. ప్రజలు నీవెంట ఉంటే రాజీనామా చేయకుండా పదవుల వెంట ఎందుకు పాకులాడుతున్నావంటూ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. ఈటల (Eatala Rajender)కు నిలువెళ్లా విషం ఉందని, టీఆర్ఎస్ ప్రభుత్వం పతనం కావాలని కోరుకుంటున్నాడని చెప్పారు.
Also Read: COVID-19 Vaccine: భారత్‌లో కరోనాపై ఏ వ్యాక్సిన్లు ప్రభావం చూపుతాయో తెలుసా
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ వచ్చిందంటే కేసీఆర్ ఇక ఆగడంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించేవాడని గుర్తుచేశారు. అసైన్స్ భూములు, దేవరయాంజాల్ భూములపై అక్రమాలు జరిగినట్లు అధికారులు తేల్చారని, ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయితే, ఈటల రాజేందర్ వాటిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో తమిళనాడు వాళ్లు గ్రానైట్ క్వారీలు నడుపుతుంటే స్థానిక ఎమ్మెల్యే, మంత్రిగా ఉండి కూడా ఎందుకు ఆపలేదని ఈటలను ప్రశ్నించారు. తనను ఇంకోసారి బిడ్డా అని సంబోధించి మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సైతం మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) హెచ్చరించారు.
కాగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన స్వగ్రామానికి చేరుకుని తండ్రి ఆశీర్వాదం తీసుకున్నారు. స్థానిక సీతారామస్వామి ఆలయంలో పూజలు చేశారు. హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలు తనను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని, ఈ ప్రజలకు విద్వేషాలు తెలియదన్నారు. తన ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని, గొర్ల మంద మీద తోడేళ్లు పడ్డ మాదిరిగా తన వెంట ఉండే వ్యక్తులను సైతం ఇబ్బందులకు గురి చేయడం పద్ధతి కాదని హితవు పలికారు. అధికారం శాశ్వతం కాదని, ఇంఛార్జీగా ఈ నియోజకవర్గానికి వస్తున్న నేత గుర్తుంచుకోవాలన్నారు. 2023లో మీరు అధికారంలోకి రావడం కష్టమేనని, ప్రజల ఓపికను, సహనాన్ని పరీక్షించాలనుకుంటే మాడి మసైపోతారంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
Also Read: Telangana lockdown: లాక్‌డౌన్ సందర్భంగా మారిన బ్యాంకుల పనివేళలు.. Banks timings
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook