Telangana lockdown: లాక్‌డౌన్ సందర్భంగా మారిన బ్యాంకుల పనివేళలు.. Banks timings

Banks timings during lockdown in Telangana: హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో అటు బ్యాంకుల సిబ్బంది, ఇటు ఖాతాదారులను దృష్టిలో పెట్టుకుని  బ్యాంకుల పనివేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 12, 2021, 08:53 PM IST
Telangana lockdown: లాక్‌డౌన్ సందర్భంగా మారిన బ్యాంకుల పనివేళలు..  Banks timings

Banks timings during lockdown in Telangana: హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో అటు బ్యాంకుల సిబ్బంది, ఇటు ఖాతాదారులను దృష్టిలో పెట్టుకుని  బ్యాంకుల పనివేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. మే 13, గురువారం నుంచి లాక్ డౌన్ అమలులో ఉన్న ఈ 10 రోజుల పాటు కొత్త పనివేళలు వర్తిస్తాయి. బ్యాంక్‌లో 50 శాతం సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉంటారు. 

తెలంగాణలో ఈ పది రోజుల పాటు ప్రతీ రోజు ఉదయం 6 నుంచి  10 గంటల వరకు మాత్రమే యధావిధిగా అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమలులోకి వచ్చేస్తుంది. ఈ కారణంగానే బ్యాంకుల పనివేళల (Banks working hours) విషయంలో మార్పులు చోటుచేసుకున్నాయి. 

తెలంగాణలో నేటి నుంచే అమలులోకి వచ్చిన లాక్‌డౌన్ (Lockdown in Telangana) చాలా చోట్ల కఠినంగా అమలు అవుతుండగా అక్కడక్కడ మాత్రం జనం రోడ్లపైనే తిరుగుతూ కనిపించారు. అయితే, నిన్నటిమొన్నటివరకు ఉన్న పరిస్థితితో పోల్చుకుంటే.. ఇవాళ పరిస్థితి కొంతమేరకు మెరుగ్గా ఉన్నట్టే కనిపించింది. రోడ్లపై జనం రద్దీ చాలా వరకు తగ్గిపోయి రోడ్లు ఖాళీగా కనిపించాయి.

Trending News