Eatala Rajender slams CM KCR: సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

Eatala Rajender comments on CM KCR: హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన ఫామ్‌హౌజ్‌కు అసైన్డ్ భూముల్లో నుంచి రోడ్లు వేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించిన ఈటల రాజేందర్.. తనపై ఒక పథకం ప్రకారమే ఇలా భూ కబ్జా ఆరోపణలు (Land kabja allegations) చేసి ఇరికించేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు.

Last Updated : May 3, 2021, 04:13 PM IST
  • సీఎం కేసీఆర్‌తో 19 ఏళ్లుగా కలిసి ప్రయాణం చేస్తున్నానన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్.
  • ఏనాడూ పార్టీకి, ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కి మచ్చ తెచ్చే పని చేయలేదు.
  • తనను ఇరికించేందుకు జరిగిన కుట్రలో భాగమే ఈ తప్పుడు రిపోర్ట్
  • CM KCR farm house కి అసైన్డ్ భూముల్లోంచి రోడ్లు వేయలేదా అని నిలదీసిన Eetela Rajender
Eatala Rajender slams CM KCR: సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

Eatala Rajender comments on CM KCR: హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన ఫామ్‌హౌజ్‌కు అసైన్డ్ భూముల్లో నుంచి రోడ్లు వేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించిన ఈటల రాజేందర్.. తనపై ఒక పథకం ప్రకారమే ఇలా భూ కబ్జా ఆరోపణలు (Land kabja allegations) చేసి ఇరికించేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌తో కలిసి చేసిన తన 19 ఏళ్ల ప్రయాణంలో తాను ఏనాడూ పార్టీకి కానీ లేదా ప్రభుత్వానికి కానీ, సీఎం కేసీఆర్‌కు కానీ మచ్చ తెచ్చే పని చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాకుండా నమస్తే తెలంగాణ పేపర్‌కు తన పౌల్ట్రీ ఫామ్ కుదువ పెట్టి మరీ జాగ ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. 2008 లో కేసీఆర్ చెప్పారని రాజీనామా చేయడానికి కూడా వెనుకడుగు లేయలేదని.. అలాంటి తనపై ఉద్యమ నాయకుడే ఇవాళ అధికారాన్ని, శక్తినంతా ప్రయోగించారని ఈటల రాజేందర్ వాపోయారు. 

మీ అరెస్టులకు, కేసులకు భయపడే రకం కాను..
మీ అరెస్టులు, కేసులు తనను ఏమీ చేయలేవని, వాటిని చూసి భయపడేంత చిన్న వ్యక్తిని కాదని మాజీ మంత్రి ఈటల సీఎం కేసీఆర్‌కి (Eatala Rajender vs CM KCR) సవాలు విసిరారు. తనపై విజిలెన్స్, ఏసీబీ, రెవెన్యూ శాఖలను ప్రయోగించి మరీ తనని ఇబ్బందులపాలు చేసేందుకు చూస్తున్నారని.. కేసీఆర్ లాంటి స్థాయి వ్యక్తికి ఇలాంటి కుట్రలు తగని పనులని అన్నారు. 

Also read : Eatala Rajender: భూ కబ్జా ఆరోపణలను తిప్పికొడుతూ వారిపై కన్నెర్ర చేసిన మంత్రి ఈటల రాజేందర్

19 ఏళ్ల నుంచి సీఎం కేసీఆర్‌తో (CM KCR) కలిసి ఉంటున్నప్పటికీ.. పదవిని అడ్డం పెట్టుకుని తాను సింగిల్ పైసా వ్యాపారం చేయలేదని, అధికారంలో ఉన్నాం కదా అని ఏది పడితే అది చేయడం సరికాదని సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్ హితవు పలికారు. నన్ను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు నువ్వు పంపించిన నీ అధికారులకు వావి వరసలు కూడా తెలియడం లేదని, తన భార్య జమున (Eetela Rajender's wife Jamuna Reddy) భర్త పేరు స్థానంలో తన పేరు కాకుండా తన కొడుకు పేరు రాశారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. 24 గంటల్లో తప్పుడు నివేదికలు తెప్పించుకునేందుకు తొందరపెట్టడం వల్లే అధికారులు ఆ తప్పిదం చేశారని, అందుకు కొడుకు పేరును భర్త పేరు స్థానంలో రాయడమే నిదర్శనం అని ఈటల తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి హోదాలో (CM KCR) మీరు ఆదేశించాకా ఏ కలెక్టర్ అయినా మీరు చెప్పినట్టుగానే తప్పుడు రిపోర్ట్ ఇస్తారని వ్యాఖ్యానించిన రాజేందర్.. మీ కలెక్టర్ రిపోర్ట్ ఇంకా తనకు అధికారికంగా అందలేదని అన్నారు. 

Also read : Minister Etela Dispute: మంత్రి ఈటెల రాజేందర్‌కు షాక్, వైద్య ఆరోగ్య శాఖ తొలగింపు

భూకబ్జాలపై విచారణ జరిపేటప్పుడు ఎవరిపైనేతే విచారణ జరుపుతారో వారికి ముందుగా నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటారని, తన విషయంలో కనీసం వివరణ కూడా తీసుకోలేదన్నారు. అందుకే తాను చట్టబద్దంగా కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పిన సవాల్ చేశారు. తాను తప్పుచేస్తే ఏ శిక్షకైనా సిద్ధంగానే ఉన్నానని, కానీ తాను ఏ తప్పూ చేయలేదని ఈటల రాజేందర్ (Eetela Rajender press meet live updates) స్పష్టంచేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News