Jagadeeshwar Reddy aide attack on Q News: మంత్రి జగదీశ్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. తీన్మార్ మల్లన్న నిర్వహిస్తున్న క్యూ న్యూస్ ఆఫీసుపై దాడికి పాల్పడ్డారు. సిబ్బందిని అసభ్యపదజాలంతో దూషిస్తూ భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేశారు.  నిన్న ఉదయం తీన్మార్ మల్లన్న మార్నింగ్ న్యూస్ చదివే సమయంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డపై దురుసుగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారు. తాము వారిస్తున్నప్పటికీ వినిపించుకోకుండా బెదిరింపులకు పాల్పడుతూ దాడికి పాల్పడ్డారని క్యూ న్యూస్ ఆఫీస్ సిబ్బంది వాపోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


నిరసనకు కూడా ఓ పద్ధతి ఉంటుందని.. ఏదైనా ఉంటే వివరణ ఇవ్వండి అంటూ తాను చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా దాడికి పాల్పడ్డారని క్యూ న్యూస్ సిబ్బంది తెలిపారు. అంతేకాకుండా క్యూ న్యూస్ సిబ్బంది శాంతియుతంగా మాట్లాడుతున్నప్పటికీ.. మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు మాత్రం నోటికొచ్చినట్టు దుర్భాషలాడారని సిబ్బంది ఆవేదన వ్యక్తంచేశారు.


అధికార పార్టీ నేతల అనుచరులు క్యూన్యూస్ ఆఫీసుపై దాడులకి పాల్పడటం ఇదేం తొలిసారి కాదు.. గతంలోనూ పలు సందర్భాల్లో క్యూన్యూస్ ఆఫీసుపై దాడులు జరిగాయి. మరో సందర్భంలో మేడిపల్లి పోలీసులు సైతం క్యూన్యూస్ ఆఫీసులో తనిఖీలు చేసి కార్యాలయంలోని హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. 


క్యూ న్యూస్ ఆఫీసుపై దాడిని ఖండిస్తూ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసన వ్యక్తంచేయాల్సిందిగా రిటైర్డ్ సీఐ, తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కన్వీనర్ దాసరి భూమయ్య రాష్ట్రంలోని తీన్మార్ మల్లన్న టీమ్ కన్వినర్లు, కో కన్వినర్లకు పిలుపునిచ్చారు.


Also Read : TRS MLAs Trap Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు


Also Read : Mla Rohith Reddy Audio Leak: బీజేపీ టాప్-1,2 లీడర్స్‌తో మాట్లాడిస్తా.. రామచంద్ర భారతీ-రోహిత్ రెడ్డి ఆడియో లీక్..!


Also Read : TRS MLAs Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి