Etela Rajender Press Meet: నరేంద్ర మోదీ ఒక బీసీ బిడ్డ అని.. ఆకలి తెలిసిన వాడు కాబట్టే పేదలకు కావాల్సిన పథకాలు ప్రవేశపెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ స్కాముల పాలనతో విసిగిపోయిన ప్రజలకు మోదీ పాలన నమ్మకం కలిగించిందన్నారు. అందుకే 9 ఏళ్ల తరువాత కూడా మోదీ ప్రభ తగ్గలేదని అన్నారు. మేడ్చల్‌లో జరిగిన బీజేపీ ఓబీసీ మొర్చా రాష్ట్ర కార్యవర్గ, మండల అధ్యక్షుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. భారత గొప్పదనం ప్రపంచ పటం మీద మోదీ నిలబెట్టారని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"మనం ఆత్మన్యూనతతో బతకవద్దు. దానికి నా జీవితమే ఒక ఉదాహరణ. ఈ మల్లయ్య కొడుకు కూడా ఎమ్మెల్యే అవుతారా అని హేళన చేశారు. ఛాలెంజ్ చేసిన.. 20 ఏళ్ల అనుభవం ఉన్న వారిని పక్కన పెట్టి నన్ను గెలిపించారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా పేరు సంపాదించుకోవాలని నిర్ణయించుకుని పని చేశా.. సాధించా.. గెలవలా ఓడాలా మన చేతుల్లో ఉంటుంది. హక్కులు ఒకరు ఇస్తే వచ్చేవికావు లాక్కోవాలి. పెద్ద కులం అయితేనే గెలుస్తారనుకోవడం తప్పు. మన డిక్షనరీలో సాధ్యం కానిది ఏమీ లేదు అని ఉండాలి.


అప్పుడే ఏదైనా సాధించగలం. మోదీ గారు కూడా అదే చెప్తారు. బీసీలకు కూడా సబ్ ప్లాన్ పెట్టాలనే చర్చ జరుగుతుంది. ఎస్‌సీ, ఎస్‌టీ ప్లాన్ ఉన్నా కూడా ఆ నిధులు ఈ ప్రభుత్వం ఖర్చు చేయడం లేదు. వారి జీవితాలు మారడం లేదు. వారి డబ్బులు కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెట్టిన దుర్మారగమైన ప్రభుత్వం ఇది. ఆ ప్రాజెక్ట్ కింద ఒక్క ఎకరం కూడా మాకు లేదు ఎందుకు కాళేశ్వరం కోసం మా నిధులు ఖర్చు పెడతారు అని అడిగినా సమాధానం లేదు. ఎంబీసీ కార్పొరేషన్ పెట్టిన రోజు కేసీఆర్‌కి పాలాభిషేం చేశారు. కానీ కేటాయించిన డబ్బులు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు.." అని ఈటల రాజేందర్ అన్నారు. 


దొంగ దొర లెక్క తయారు అయ్యారని.. బీసీలు ఆర్థికంగా లేకపోవచ్చు కానీ మనకు చైతన్యానికి కొదవలేదన్నారు. విద్య, వైద్యం, గూడు ముఖ్యంగా అవసరం అని అన్నారు. కేసీఆర్ అన్నిటిలో నంబర్ వన్ అని చెప్తారని.. ఆయన అబద్ధాల్లో నంబర్ వన్, నిధులు ఇచ్చి ఎగ్గొట్టడంలో నంబర్ వన్.. దేశంలో తాగించడంలో నంబర్ వన్ అని ఎద్దేవా చేశారు. మద్యం మీద తెలంగాణ వచ్చినప్పుడు ఆదాయం 10,700 కోట్లు అయితే ఇప్పుడు అది 45 వేలకోట్లకు చేరుకుందన్నారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలు ఊహించుకోలేక పోతున్నారని అన్నారు. కేసీఆర్‌ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గమనిక.. రెండు రోజుల్లో డీఏపై పెంపుపై క్లారిటీ..!  


Also Read: Asia Cup 2023: సచిన్ రికార్డుపై రోహిత్ శర్మ కన్ను.. టాప్ ప్లేస్‌కు చేరవలో..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook