Cbi Notices To Mlc Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఖాయమని టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బీజేపీ నుంచి సిగ్నల్స్ వచ్చాయన్నారు. కవితను విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు జారీ చేయడంపై ఆయన స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వివరాలు తెలుసుకునేందుకు మాత్రమే కవితను విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సీబీఐ పేర్కొన్న విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసేందుకు బీజేపీ ఇన్‌డైరెక్ట్‌గా సిగ్నల్స్ ఇచ్చింది. ఆమెను సీబీఐ అరెస్ట్ చేయబోతుంది. తెలంగాణలో రెండు నెలలుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారమే నడుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలులో బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేస్తే.. మరింత సమాచారం బయటపడుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత.. ఎమ్మెల్యేల కేసులో బీఎల్ సంతోష్‌ ఇద్దరూ నిందితులే. ఇద్దరిని అరెస్ట్ చేయాల్సిందే. బీజేపీ, టీఆర్ఎస్ రెండు స్కామ్‌లో చిక్కుకున్నాయి..' అని జగ్గారెడ్డి అన్నారు. 


బీఎల్ సంతోష్‌ను కాపాడుకునేందుకు బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తోందని.. ఆయనను అడ్డుకుపెట్టుకుని రాజకీయ వ్యభిచారం చేస్తోందని మండిపడ్డారు జగ్గారెడ్డి. తెర వెనుక ప్రధాని మోదీ, అమిత్ షా ఉన్నారని ఆరోపించారు. కోర్టులను అడ్డుపెట్టుకుని బీఎల్ సంతోష్ బయటపడాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. 


కవితలో భయం కనిపిస్తుందని.. పైకి మాత్రం అరెస్ట్ చేస్తే చేసుకోండని అంటూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఎవరికైనా భయం ఉంటుందని.. ఆమె కూడా భయపడుతున్నారని అన్నారు. కవిత ప్లేస్‌లో ఉంటే తాను కూడా భయపడతానని అన్నారు.  


మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు రావడం అధికార టీఆర్ఎస్ పార్టీలో కలవరం రేపుతోంది. డిసెంబర్ 6 మంగళవారం ఆమె సీబీఐ ముందు హాజరుకానున్నారు. కవిత విచారణ తర్వాత సీబీఐ ఏం చేయనుందన్నది ఆసక్తిగా మారింది. సీబీఐ నోటీసులు వచ్చిన ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. సీబీఐ నోటీసులు, భవిష్యత్ కార్యాచరణపై ఆమె చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు నందీనగర్‌లో సీఎం ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర భారీగా భద్రత కల్పించారు. కవిత ఇంటికి టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు.


Also Read: 7th Pay Commission: న్యూ ఇయర్‌కు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై క్లారిటీ


Also Read: Rajamouli Oscar Award : రాజమౌళికి ఆస్కార్ అవార్డ్ ఫిక్స్.. ఇదిగో సాక్ష్యం.. నెట్టింట్లో వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి