MLC Kavitha: రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కానున్న ఎమ్మెల్సీ కవిత.. గులాబీ బాస్ వ్యూహం అదేనా..!
MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గులాబీ దళపతి.. మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్ ముద్దుల తనయ తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ కానున్నారా.. ? అందుకు కేసీఆర్ పకడ్బందీ ప్రణాళిక రూపొందించారా అంటే ఔననే అంటున్నాయి బీఆర్ఎస్ పార్టీ నేతలు.
MLC Kavitha: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముద్దుల తనయ ఎమ్మెల్సీ కవిత మళ్లీ యాక్టివ్ అయ్యారా అంటే ఔననే చెప్పాలి. అంతేకాదు జనంలోకి వచ్చేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు. లిక్కర్ స్కాం కేసులో తిహార్ జైలుకు వెళ్లి.. బెయిల్ పై వచ్చిన కవిత.. చాలా రోజులుగా సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు క్షేత్ర స్థాయిలో ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
ఇందులో భాగంగా తెలంగాణ జాగృతి నేతలతో తన నివాసంలో సమావేశమయ్యారు. బీసీ జనాభా లెక్కలు తేల్చాలని కమిషన్ కు కవిత వినతిపత్రం అందజేయబోతున్నట్లు తెలుస్తోంది. కవిత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 26న బీసీ డెడికేషన్ కమిషన్‌ను కలవనుంది. ఆమె వినతిపత్రం అందజేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. కమిషన్ న్యాయబద్దంగా కులగణన వివరాలు సేకరించాలని విజ్ఞప్తి చేయనున్నారు.
మరోవైపు కేసీఆర్ తెలంగాణ మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించబోతన్నట్టు చెప్పారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి పదవి ఖాళీ అయ్యి దాదాపు ఆరు నెలలు దాటిపయింది. గుండు సుధారాణి రాజీనామా చేశాక.. ఆ పదవి ఎవరికీ అప్పగించ లేదు. కొద్దిరోజులుగా ఆ పదవి దక్కించుకునేందుకు కొందరు మహిళా నేతలు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో.. గప్‌చుప్ అయ్యారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ పదవి కవితకు అప్పగించి రాజకీయంగా ఆమెను మరింత బలోపేతం అయ్యేలా చేస్తారనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే కేటీఆర్.. కార్యనిర్వహాక అధ్యక్షుడిగా నియమించారు. ఇలా ఒకే ఇంట్లో కీలకమైన మూడు ముఖ్యమైన పదవులు ఒకరిని నియమిస్తే ప్రజల్లో చెడు సంకేతాలు వెళ్లే అవకాశాలున్నాయి. ఎవరేమనుకున్న ఈ పదవిలో కూతురును నియమిస్తాడా.. ? లేకపోతే.. వేచి చూస్తాడా అనేది చూడాలి.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter