MLC Kavitha Fires on BJP: బీజేపీపై ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీలో చేరకపోతే ఈడీ, ఐటీ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. నాగిరెడ్డిపేట్  మండలం తాండూరులో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ కవిత, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే జాజాల సురేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బ‌య‌ట లీడ‌ర్ల‌ను తీసుకువ‌చ్చి రాజ‌కీయం చేయ‌డం బీజేపీ ప‌ని అని అన్నారు. నెల రోజుల నుంచి మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను వ‌ద‌ల‌కుండా రైడ్ చేస్తున్నారని మండిపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి . తెలంగాణ వాళ్లు భయ‌ప‌డే వాళ్లు కాదు. వ్యాపారం లీగ‌ల్‌గా చేసుకుంటారు.. అధికారులు అడిగితే స‌మాధానం చెబుతారు. మ‌న ద‌గ్గ‌ర ఎమ్మెల్యే కోనుగోలు కేసులో బీఎల్ సంతోష్ పేరు వ‌చ్చింది కాబ‌ట్టి విచార‌ణ‌కు పిలిచారు. పిలిస్తేనే ఎందుకు అంత భ‌యం. ఇక్క‌డ దొరికిన దొంగ‌ల మీద విచార‌ణ చేయొద్దా..? సంజయ్ యాద‌గిరి గుట్ట‌కు వెళ్లి దొంగ ప్ర‌మాణాలు చేశారు. నిన్న కూడా ఎందుకు ఏడ్చాడో తెలియ‌దు. అడ్డంగా దొరికిన బీఎల్ సంతోష్ట్‌ అరెస్ట్ చేయొద్దని కోర్టుకు వెళ్లారు. మ‌న మంత్రులు ఏ ఏజెన్సీకి అయినా స‌హ‌కరిస్తున్నారు.' అని కవిత అన్నారు.


బాబు తానే చక్రం తిప్పుతాననుకుంటున్న సమయంలోనే కేసీఆర్ పిడికిలి బిగించిండని.. రాజకీయంగా ఆగం కావల్సిన అవసరం లేదన్నారు కవిత. మోదీ ఇవ్వకున్నా సరే.. గిరిజన రిజర్వేషన్లు పదిశాతం ఇచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. రైతుబంధును కాపీ కొట్టి పీఎం కిసాన్ యోజన పెట్టారన్నారు. 


మొన్ననే రాహూల్ దక్షిణ తెలంగాణాలో ఓవైపు మునుగోడులో ఎన్నికలు జరిగితే.. ఉత్తర తెలంగాణా నుంచి ఎందుకొచ్చిండో తెల్వదన్నట్లు వెళ్లిపోయిండని కౌంటర్ ఇచ్చారు. తాండూరు త్రిలింగేశ్వర ఆలయ అభివృద్ధికి.. ఏడుపాయలు, పోచారం వంటి ప్రాంతాలతో పాటు.. ఈ ప్రాంతాన్ని టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేసేందుకు  తన వంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.


 Also Read: Hardik Pandya: అందుకే సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశం రాలేదు.. హార్ధిక్ పాండ్యా షాకింగ్ స్టేట్‌మెంట్


 Also Read: US Shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు.. 10 మంది మృతి  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి