Hardik Pandya: అందుకే సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశం రాలేదు.. హార్ధిక్ పాండ్యా షాకింగ్ స్టేట్‌మెంట్

Hardik Pandya Clarity on Sanju Samson Place: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్ మరోసారి బెంచ్‌కు పరిమితమయ్యారు. ఈ విషయంపై కెప్టెన్ హార్ధిక్ పాండ్యా క్లారిటీ ఇచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2022, 01:19 PM IST
Hardik Pandya: అందుకే సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశం రాలేదు.. హార్ధిక్ పాండ్యా షాకింగ్ స్టేట్‌మెంట్

Hardik Pandya Clarity on Sanju Samson Place: న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వగా.. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించాడు. సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో ఈ సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. దీపక్ హుడా, సిరాజ్, అర్ష్‌దీప్ బౌలింగ్‌లో సత్తా చాటారు. అయితే ఉమ్రాన్ మాలిక్, సంజూ శాంసన్‌లకు ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం కల్పించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 

ఈ విషయంపై కెప్టెన్ హార్ధిక్ పాండ్యా క్లారిటీ ఇచ్చాడు.'ఇది నా జట్టు. బయట ఏమి మాట్లాడుతున్నారో నేను పట్టించుకోను. చిన్న సిరీస్‌ల కారణంగా కొంతమంది ఆటగాళ్లకు అవకాశం రాలేదనే చెప్పాలి. ఇప్పుడు ఛాన్స్‌ రాని వారికి భవిష్యత్తులో అవకాశాలు లభిస్తాయి. ఇందులో నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. కెప్టెన్‌గా తాను ఆరో బౌలింగ్ ఎంపికగా వెళ్లాలనుకున్నా. అందుకే దీపక్ హుడాకు అవకాశం కల్పించాం. ఇంకా చాలా సమయం ఉంది. అందరికీ అవకాశాలు వస్తాయి. కెప్టెన్‌గా, ఆటగాడికి నేను ఇవ్వగలినంత అవకాశాలు ఇస్తా..' అని పాండ్యా తెలిపాడు. 

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఓపెనర్‌గా రిషబ్ పంత్‌కు అవకాశం ఇచ్చాడు. అయితే పంత్ పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం ఇవ్వకపోడంతో అభిమానులు ఫైర్ అయ్యారు. రిషబ్ పంత్‌ రెండు మ్యాచ్‌లలో ఓపెనర్‌గా అవకాశం లభించింది. అయితే అతను రెండు మ్యాచ్‌ల్లో వరుసగా  6, 11 పరుగులు మాత్రమే చేసి తీవ్రనిరాశకు గురిచేశాడు. స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్‌కు కూడా ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కలేదు. 

ఇప్పుడు భారత్, న్యూజిలాండ్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు రెడీ అవుతున్నాయి. ఈ సిరీస్‌కు సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లు కూడా ఎంపికయ్యారు. టీ20 సిరీస్‌లో అవకాశం దక్కని వాళ్లకు.. వన్డే సిరీస్‌లో ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. టీ20 సిరీస్‌ను టీమిండియా 1-0తో కైవసం చేసుకుంది. తొలి టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. మూడో టీ20 మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా దెబ్బతినడంతో టైగా ప్రకటించారు. 

Also Read: Shraddha Murder Case: తనను చంపేస్తాడని రెండేళ్ల క్రితమే శ్రద్ధా పోలీసులకు ఫిర్యాదు.. ఆ చిన్న తప్పుతో ఘోరం  

Also Read: Rishab Shetty - Rashmika Mandanna : రష్మికకి అంత పొగరా?.. తిక్క తీర్చిన రిషభ్ శెట్టి.. వీడియో వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News