Hyderabad Net work down: హైదరాబాద్‌లో పలు మొబైల్‌ నెట్‌వర్క్స్‌కు అంతరాయం ఏర్పడింది. ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్స్‌కు ఈసమస్య తలెత్తింది. ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు ఇంటర్‌నెట్ పని చేసినప్పటికీ..వాయిస్‌ కాల్స్‌కు ఇబ్బంది కల్గింది. వాట్సాప్‌ వాయిస్ కాల్స్, ఇతర సేవలు యధావిధిగా కొనసాగాయి. దాదాపు 30 నిమిషాలపాటు ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. సాంకేతిక కారణాలతోనే నెట్‌వర్క్స్‌కు అంతరాయం ఏర్పడిందని సదరు సంస్థలు వెల్లడించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీనిపై పలువురు ఎయిర్‌టెల్ వినియోగదారులు సోషల్‌ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఎయిర్‌టెల్ నెట్‌ వర్క్ సిగ్నల్ రావడం లేదని..ఇంటర్నెట్‌ యాక్సెస్ చేయలేకపోతున్నామని కామెంట్లు చేస్తున్నారు. దీనికి ఎయిర్‌టెల్ డౌన్ హ్యాష్‌ ట్యాగ్‌తో ట్వీట్లు పెడుతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఈసమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఎయిర్‌టెల్‌ టెలికాం సేవలతోపాటు ఎయిర్‌టెల్ బ్రాడ్ బ్యాండ్, ఎయిర్‌టెల్ డీటీహెచ్‌ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు వినియోగదారులు చెబుతున్నారు.


మరికొందరికి సిగ్నల్ వస్తున్నప్పటికీ టెస్ట్‌ మెసేజ్‌లు వెళ్లడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీనిపై ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఢిల్లీకి చెందిన వినియోగదారులు ఫిర్యాదులు చేస్తున్నారు.


Also read: Pawan Comments on 10th Results: ఏపీలో పది ఫలితాలపై దుమారం..పవన్ కళ్యాణ్‌ ఏమన్నారంటే..!


Also read:Mahmood Ali on Rape Case: నిందితులు ఎవరైనా వదిలిపెట్టం..మహమూద్‌ అలీ కీలక వ్యాఖ్యలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి