BSP Chief RS Praveen Kumar Meets With Former CM KCR: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొలది తెలంగాణలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. ఇప్పటికే అనేక పార్టీల నుంచి ఆశావాహులు ఒక పార్టీ నుంచి మరోక పార్టీలోకి దూకేస్తున్నారు. ఆయా పార్టీలు తమకే పట్టం కట్టాలని వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీజేపీలో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి బీఆర్ఎస్, కాంగ్రెస్ ల  డీఎన్ఏ ఒక్కటే అని చెప్పి తమను గెలిపించాలని కోరుతుంది. ఇక కాంగ్రెస్ మాత్రం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక్కటే అని, పైకి తిట్టుకున్న లోపల ఇద్దరు మాత్రం ఒక్కటే అని చెప్పుకొస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More:Acidity Home remedies: ఆహారం తిన్నవెంటనే అసిడిటీ సమస్యా? ఈ 5 హోంరెమిడీస్‌తో సమస్యకు చెక్ పెట్టండి..


ఇక.. బీఆర్ఎస్ పార్టీ.. ఇది మన తెలంగాణ మనుగడకే సవాల్ అని.. దీనిలో మనం గెలవకుంటే , మన మనుగడకే పెద్ద ముప్పు వస్తుందని కూడా బీఆర్ఎస్ నేతలు ప్రజలు తమకే మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అన్ని పార్టీలు కూడా గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ నుంచి అనేక మంది నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి, బీజేపీలోకి వలసలు వెళ్లారు.


బీఆర్ఎస్ తమ నేతలను కాపాడుకుంటూ.. ప్రజల్లో నమ్మకం కోల్పోకూండా ఆచీతూచీ అడుగులు వేస్తుంది. ఈక్రమంలోనే మంగళవారం అనూహ్యా పరిణామం చోటు చేసుకుంది. నందిగ్రామ్ లోని కేసీఆర్ నివాసానికి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడుప్రవీణ్ కుమార్ వెళ్లారు. తమ పార్టీ నేతలతో వెళ్లి కలిశారు. తాజాగా తెలంగాణలో కొనసాగుతున్న రాజకీయ పరిస్థితులు, అనేక అంశాలపై ఇద్దరు కలిసి చర్చించినట్లు తెలుస్తోంది.


Read More: Rashmi Gautam Pics: హాట్ బాంబ్ పేల్చిన రష్మి.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు..


అయితే.. నాగర్ కర్నూల్ నుంచి ప్రవీణ్ కుమార్ ఎంపీగా బరిలో ఉంటారని గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. వచ్చే ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి పోటీచేస్తామని బీఎస్పీ ప్రకటించింది. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook