Revanth Reddy: హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ( KCR ) పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సచివాలయ కూల్చివేత ( secretariat demolition ) విషయంలో సీఎం కేసీఆర్ తన రహస్య ఎజెండాను అమలు చేశారని పలు అనుమానాలను తెరపైకి తెచ్చారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సచివాలయం జీ బ్లాక్‌ (secretariat G Block) కు సంబంధించి సీఎం కేసీఆర్ చాలా ప్రణాళికగా ముందుకు వెళ్లారని, మాయ మాటలతో హెరిటేజ్ బిల్లును పాస్ చేయించుకున్నారని ఆరోపించారు. మూడు కిలోమీటర్లు ఆంక్షలు పెట్టి సచివాలయాన్ని రహస్యంగా కూల్చాల్సిన అవసరం ఏముందని రేవంత్ ప్రశ్నించారు. Also read: TS secretariat: వాస్తు పేరుతో దారుణం: రేవంత్‌ రెడ్డి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన బంధువు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న రఘునందన్ రావును ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేసి కేసీఆర్ ఈ కార్యచరణను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రారంభించారని రేవంత్ ఆరోపించారు. వెంటనే రఘునందన్ రావును తొలగించాలని డిమాండ్ చేశారు. సచివాలయం జీ బ్లాక్ కింద గుప్త నిధులు ఉన్నాయన్న అనుమానాలు చాలా కాలం నాటి నుంచి ఉందని దానికి సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయం కూల్చివేతకు కోర్టు నుంచి అనుమతి రాగానే సీఎం ఫాంహౌస్‌కి వెళ్లారని ప్రచారం జరుగుతోందని, సీఎం ఫాంహౌస్‌కి వెళ్లారా లేక, మరేదైన రహస్య ప్రదేశానికి వెళ్లారా.. అనేది అనుమానంగా ఉందన్నారు. యాదగిరిగుట్ట నిర్మాణంలో లేని రహస్యం, సచివాలయం విషయంలో ఎందుకని ప్రశ్నించారు. Also read: Notice to Twitter: ట్విటర్‌కి భారత్ నోటీసులు


సచివాలయ భవనాల కింద గుప్తనిధులు లేకపోతే అంత రహస్యంగా ఎందుకు కూల్చుతున్నారని ప్రశ్నించారు.  పురావస్తు శాఖ అధికారులు అనుమతులు అడిగినా ఎందుకు ఇవ్వలేదని, దీనిపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్ఎండీసీ, ఆర్కియాలజీ శాఖల ఆధ్వర్యంలో సచివాలయాన్ని కూల్చాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీలతో హెరిటేజ్ కమిటీ వేయాలని, కూల్చివేత ప్రదేశానికి మీడియాను అనుమతించాలని రేవంత్ పేర్కొన్నారు. Also read: Vijay Mallya: భారత ప్రభుత్వానికి విజయ్ మాల్యా కొత్త ఆఫర్