Hyderabad Musi Floods: హైదరాబాద్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. మూసీ నదిలో వరద ఉధృతికి నదిని ఆనుకున్న ఉన్న కాలనీలకు ముప్పు ఏర్పడింది. దీంతో కిషన్ బాగ్, అసద్ బాబా నగర్ తదితర కాలనీల్లోని ప్రజలను పోలీసులు అక్కడి నుంచి తరలిస్తున్నారు. మూసారాంబాగ్, చాదర్‌ఘాట్, పురానాపూల్ బ్రిడ్జిలపై ఇప్పటికే వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మూసారాంబాగ్ బ్రిడ్జిపై మూసీ వరద పొంగిపొర్లుతోంది. ఇది పురాతన బ్రిడ్జి కావడంతో కూలిపోతుందేమోననే భయాందోళన వ్యక్తమవుతోంది. చాదర్‌ఘాట్ లోలెవల్ బ్రిడ్జిని కూడా వరద ముంచెత్తింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎగువన చేవెళ్ల, పరిగి, వికారాబాద్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో మూసీలోకి ఒక్కసారిగా భారీ వరద చేరింది. వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం వరద సహాయక చర్యలను చేపట్టింది. క్షేత్ర స్థాయిలో వరద పరిస్థితులను పర్యవేక్షిస్తూ అధికారులు చర్యలు చేపడుతున్నారు. 


వరద ఉధృతి ప్రమాదకర స్థాయికి చేరడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. గండిపేట వద్ద వరదలో చిక్కుకుపోయిన ఓ కుటుంబాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. గండిపేట వద్ద ఓ ఫాంహౌస్‌లో నివసిస్తున్న ఈ కుటుంబం వరద ప్రవాహం పెరగడంతో జలదిగ్భంధంలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.


వరద ఉధృతి రీత్యా సూర్యాపేటలోని మూసీ డ్యామ్ గేట్లను కూడా అధికారులు ఎత్తివేశారు. మూసీ వరద నీటిని దిగువన కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. గతంలో మూసీ వరద ఉధృతికి డ్యామ్ గేటు విరిగిపోయిన ఘటనను దృష్టిలో ఉంచుకుని ఈసారి అధికారులు ముందుగానే అప్రమత్తమయ్యారు.


Also Read: Nokia C21 Plus: 'నోకియా సీ21 ప్లస్' ఇప్పుడు రూ.599కే... డెడ్ చీప్‌గా బెస్ట్ బ్రాండ్‌ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఇదే బెస్ట్ ఛాన్స్..


Also Read: 


Actor Nithin: కుల వివాదంలో నితిన్ దర్శకుడు.. ఆ కులాలపై దారుణ వ్యాఖ్యలు!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook