Nokia C21 Plus: 'నోకియా సీ21 ప్లస్' ఇప్పుడు రూ.599కే... డెడ్ చీప్‌గా బెస్ట్ బ్రాండ్‌ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఇదే బెస్ట్ ఛాన్స్..

Nokia C21 Plus For Low Price: అమెజాన్‌లో రూ.599కే బ్రాండ్ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. నమ్మశక్యంగా లేదా.. అయితే ఈ ఆఫర్ వివరాలు తెలుసుకోండి.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 27, 2022, 11:06 AM IST
  • అమెజాన్ బెస్ట్ ఆఫర్స్
  • అమెజాన్‌లో నోకియా సీ21 ప్లస్ స్మార్ట్ ఫోన్‌ రూ.599కే
  • ఆఫర్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
Nokia C21 Plus: 'నోకియా సీ21 ప్లస్' ఇప్పుడు రూ.599కే... డెడ్ చీప్‌గా బెస్ట్ బ్రాండ్‌ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఇదే బెస్ట్ ఛాన్స్..

Nokia C21 Plus For Low Price: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు అందిస్తోంది. ప్రస్తుతం అమెజాన్ ఈకామర్స్ సైట్‌లో పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ ఫోన్లపై బిగ్ డిస్కౌంట్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. రిటైల్ షాపులో ధరతో పోలిస్తే అమెజాన్ సైట్‌లో డెడ్ చీప్‌ ధరకే ఫేవరెట్ బ్రాండ్‌ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అమెజాన్ బిగ్ డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందిస్తున్న స్మార్ట్ ఫోన్లలో 'నోకియా సీ21 ప్లస్' ఒకటి. అమెజాన్ ఆఫర్‌తో రూ.13 వేలు విలువ చేసే ఈ స్మార్ట్ ఫోన్‌ని కేవలం రూ.599కే సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

నోకియా సీ21 ప్లస్‌పై అమెజాన్ భారీ తగ్గింపు :

నోకియా సీ21 ప్లస్‌ అసలు ధర రూ.12,999. కానీ అమెజాన్‌లో 13 శాతం డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్ ఫోన్ రూ.11,299కే అందుబాటులో ఉంది. తద్వారా రూ.1700 వరకు ఆదా అవుతుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు వాడినట్లయితే మరో రూ.1000 వరకు తగ్గింపు పొందవచ్చు. అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్‌ని మరింత చౌకగా రూ.10,299కే పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌ ఉపయోగించుకుంటే కేవలం రూ.599కే..

అమెజాన్ అందిస్తున్న ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో నోకియా సీ21 ప్లస్ స్మార్ట్ ఫోన్‌ని కేవలం రూ.599కే పొందవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్ రూ.11,299కి అందుబాటులో ఉండగా ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో గరిష్ఠంగా రూ.10,700 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఎంత తగ్గింపు లభిస్తుందనేది ఎక్స్‌చేంజ్ కోసం మీరిచ్చే మొబైల్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పూర్తి ఆఫర్ లభించినట్లయితే డెడ్ చీప్‌గా రూ.599కే ఈ స్మార్ట్ ఫోన్ మీ సొంతమవుతుంది. అయితే ఎక్స్‌చేంజ్ ఆఫర్‌పై షరతులు వస్తాయని గుర్తుంచుకోండి. 

Also Read: Komatireddy Rajagopal Reddy: బీజేపీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికకు ముహూర్తం ఫిక్స్...?  

Also Read: Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ మైనర్ రేప్‌ కేసులో మరో ట్వీస్ట్..నిందితులకు బెయిల్ మంజూరు..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News