గ్రేటర్‌ హైదరాబాద్ (GHMC Elections) ఎన్నికలకు కసరత్తు మొదలైంది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నోడల్ అధికారులను నియమించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అథారిటీ, కమీషనర్ డీఎస్ లోకేష్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. జీహెచ్ఎంసీ (GHMC) ప్రధాన కార్యాలయంలో నోడల్ అధికారులుగా నియమితులైన అదనపు కమీషనర్లు, విభాగాధిపతులతో మంగళవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. Hyderabad: లక్షణాలు లేని వారితోనే కరోనా ముప్పు!: సర్వే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికలకు సంబంధించి నోడల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటర్ల జాబితా రూపకల్పన, రిటర్నింగ్ అధికారుల నియామకం, పోలీస్ సిబ్బందికి శిక్షణ, ఐటీ సంబంధిత ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మెటీరియల్ సేకరణ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై నోడల్ అధికారులతో జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ చర్చించారు. MIDHANI Recruitment 2020: అసిస్టెంట్ జాబ్స్.. ఎగ్జామ్ లేకుండానే రిక్రూట్‌మెంట్


ముఖ్యంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిర్వహిస్తున్న ఎన్నికలు కనుక కోవిడ్19 నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి నోటికేషన్ వెలువడేలోగా పూర్తి స్థాయిలో తమ కార్యాచరణతో సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల కోసం చేయాల్సిన పనులపై ఓ టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసే ఉత్తర్వులు, నిబంధనలు, సూచలనలను ఎప్పటికప్పుడూ పరిశీలించాలని నోడల్ అధికారులకు వివరించారు. 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR