Heavy Rains: తెలంగాణలో జోరుగా వానలు.. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ లో కుండపోత
Heavy Rains: నైరుతి రుతుపవనాలతో పాటు బంగ్లాదేశ్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర మొత్తం మేఘావృతమై ఉంది. కొన్ని ప్రాంతాల్లో ముసురు పట్టింది. చిరు జల్లులతో పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
Heavy Rains: నైరుతి రుతుపవనాలతో పాటు బంగ్లాదేశ్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర మొత్తం మేఘావృతమై ఉంది. కొన్ని ప్రాంతాల్లో ముసురు పట్టింది. చిరు జల్లులతో పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని దాదాపుగా అన్ని జిల్లాలో వర్షం కురిసింది. గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో మాత్రమే పొడి వాతావరణం నెలకొంది. మంచిర్యాల, కామారెడ్డి, ఆదిలాబాద్, నల్గొండ, సంగారెడ్డి, అసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి.
ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 13 సెంటిమీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా పాత రాజంపేటలో 12.3, ఆదిలాబాద్ జిల్లా పొచ్చరలో10.4 సెంటిమీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా గాంధారిలో 9.7, మంచిర్యాల జిల్లా నెన్నల్ లో 9.3, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 9.2, ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో 9.1, ఉట్నూరులో 9 సెంటిమీటర్ల భారీ వర్షం కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముసురు పట్టింది. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. గ్రేటర్ మొత్తం చిరుజల్లులు పడ్డాయి. రామచంద్రాపురం పరిధిలో 2.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లిలో 1.9 సెంటీమీటర్లు, ఆసిఫ్ నగర్, చందా నగర్ లోని హఫీజ్ పెట్ లో 1.5 సెంటీమీటర్లు, నాంపల్లి, గచ్చిబౌలి లో 1.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కెపిహెచ్బి, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, జీడిమెట్ల, బాలానగర్ ,షేక్పేట్, సంతోష్ నగర్ , డబీర్ పురాలోనూ ఓ మోస్తరు వర్షం కురిసింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Read also: Ante Sundaraniki OTT: 'అంటే సుందరానికీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎందులో, ఎప్పుడు రిలీజంటే?
Android Link - https://bit.ly/3hDyh4G
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook