TS NPDCL Jobs: తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. విడతల వారిగా జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నాయి. మొత్తం 90 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత శాఖల వారిగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇప్పటికే పోలీస్‌ శాఖతోపాటు ఇతర విభాగాల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయి. తాజాగా టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌(TS NPDCL) నుంచి జాబ్ నోటిఫికేషన్‌ జారీ అయ్యింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తం 82 అసిస్టెంట్‌ ఇంజనీర్లు(ఎలక్ట్రికల్) పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈనెల 27 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూలై 11 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఆగస్టు 14న రాత పరీక్ష ఉంటుంది. ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. పోస్టుల భర్తీలో ఎలాంటి అవకతవకలకు తావు ఉంటుందని అధికారులు తెలిపారు. అత్యంత పారదర్శకంగా ఉద్యోగులను తీసుకుంటామని స్పష్టం చేశారు.


వరుసగా నోటిఫికేషన్లు రావడంపై అభ్యర్థులు, నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నెరవేర్చుతున్నారని అంటున్నారు. మరిన్ని కీలక పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు. మరోవైపు త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్ధమవుతోంది. 


Also read: Sunil Gavaskar on DK: అలా జరగకపోతే అంతా ఆశ్చర్యమే..దినేష్ కార్తీక్‌పై గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!


Also read:Agnipath Effect: దేశంలో అగ్నిపథ్‌ ఎఫెక్ట్..పలు రైళ్ల రాకపోకలు రద్దు..ఆ వివరాలు ఇవిగో..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook