Sunil Gavaskar on DK: టీమిండియా ప్లేయర్ దినేష్ కార్తీక్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో జోరు కొనసాగించిన అతడు తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో వీరవిహారం చేశాడు. కేవలం 27 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. హార్ధిక్ పాండ్యాతో కలిసి స్కోర్‌ను పరుగులు పెట్టించాడు. ఈమ్యాచ్‌లో భారత్ గెలిచి..సిరీస్‌ను సమం చేసింది. నిర్ణయాత్మక మ్యాచ్ రేపు బెంగళూరులో జరగనుంది.
ఈక్రమంలో దినేష్ కార్తీక్‌పై దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ ప్రశంసలు కురింపించారు. అతడి ఆట తీరులో చాలా మార్పు వచ్చిందన్నారు. రాబోయే టీ20 ప్రపంచకప్ జట్టులో దినేష్ లేకపోతే ఆశ్చర్యమేనని అభిప్రాయపడ్డారు. అతడు క్రీజులోకి వచ్చేసరికి ధాటిగా ఆడే పరిస్థితి ఉందని..అందుకు తగ్గట్లే దినేష్ ఆడాడన్నారు. ప్రస్తుతం అతడి వయసు 37 ఏళ్లు అని అయినా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఇప్పుడు ఎలా ఆడుతున్నాడన్నది మాత్రమే మనం చూడాలన్నారు. అతడు కచ్చితంగా ప్రపంచకప్ జట్టులో ఉండాలని..టీమిండియాతోపాటు మెల్‌బోర్న్ వెళ్లే విమానంలో ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇలా జరగకపోతే అతి పెద్ద ఆశ్చర్యమవుతుందన్నారు. 2006లో భారత్ జట్టులోకి వచ్చిన దినేష్..నిన్నటి మ్యాచ్‌లోనే తొలి హాఫ్ సెంచరీ చేశాడు. ఇటు హార్ధిక్ పాండ్యా స్పందించాడు. కార్తీక్.. మళ్లీ జట్టులోకి రావడం చాలా మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తి దాయకమన్నాడు.
ఈక్రమంలోనే దినేష్ కార్తీక్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. మాజీ కెప్టెన్ ధోనీ పేరిట ఉన్న రికార్డును చెరిపివేశాడు. టీ20ల్లో అధిక వయసులో హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2018లో దక్షిణాఫ్రికాపై ధోనీ..36 ఏళ్ల 229 రోజుల వయసులో రెండో హాఫ్ సెంచరీ చేశాడు. నిన్నటి మ్యాచ్‌లో డీకే అర్ధ శతకం చేయడం ద్వారా ధోనీని అధిగమించాడు.
Also read: Harish Rao on Agnipath: ఆర్మీ ఉద్యోగాలకు మంగళంపాడేందుకే అగ్నిపథ్..కేంద్రంపై హరీష్ ఫైర్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook