PD Act Filed on Naveen Reddy: హైదరాబాద్: వైశాలి కిడ్నాప్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న కొణతల నవీన్ రెడ్డిపై పోలీసులు పిడి యాక్ట్ నమోదు చేశారు. దంత వైద్య కళాశాల విద్యార్థిని వైశాలి పెళ్లి చేసుకుంటుండగా సినీ ఫక్కీలో భారీ సంఖ్యలో అనుచరులను వెంట తీసుకుని వెళ్లి పెళ్లి మండపంలోనే వైశాలిని కిడ్నాప్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. గతేడాది డిసెంబర్ 9న హైదరాబాద్ శివార్లలోని ఆధిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన అప్పట్లో నేషనల్ హెడ్‌లైన్స్‌లో నిలిచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైశాలి కిడ్నాప్ కేసులో డిసెంబర్ 10న నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిపై అధిబట్ల పోలీస్ స్టేషన్ లో 5 కేసులు నమోదు చేశారు. వైశాలిని కిడ్నాప్ చేయడంతో పాటు అడ్డం వచ్చిన ఆమె కుటుంబసభ్యులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన నేరం కింద నవీన్ రెడ్డితో పాటు అతడి వెంట వెళ్లిన మరో 40 మందిపై ఆధిబట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు.


వైశాలిని కిడ్నాప్ చేయడం, ఆ క్రమంలో ఆమె కుటుంబసభ్యులపై దాడి చేయడం, వైశాలి ఫోటోలు మార్ఫింగ్ చేసి నకిలీ అకౌంట్స్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయడం, వైశాలికి తనతో ముందే పెళ్లి అయిందని చెప్పి పోలీసులను తప్పుదోవ పట్టించడం వంటి అనేక ఇతర అభియోగాల కింద నవీన్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 



వైశాలి కిడ్నాప్ జరిగిన తీరు ఆమె కుటుంబాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. దీంతో నవీన్ రెడ్డితో తమ కూతురు వైశాలికి, తమ కుటుంబానికి ముప్పు పొంచి ఉందని వైశాలి తల్లిదండ్రులు ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే కాకుండా వైశాలి కిడ్నాప్ కేసు ఉదంతంలోనే అనేక నేరాల కింద విచారణ ఎదుర్కొంటున్న కారణంగానే ముందు జాగ్రత్త చర్యగా నవీన్ రెడ్డిపై రాచకొండ పోలీసులు పిడి యాక్ట్ నమోదు చేసినట్టు సమాచారం అందుతోంది. వైశాలి కిడ్నాప్ ఉదంతం చోటుచేసుకుని రెండు నెలలు కావస్తుండగా తాజాగా నిందితుడు నవీన్ రెడ్డిపై పోలీసులు పిడి యాక్ట్ నమోదు చేశారు.


ఇది కూడా చదవండి : Jalakantha Lucky Stone: లక్కీ స్టోన్ జలకాంత అని చెప్పి రూ. 2 కోట్లకు ఉత్తి రాయిని అమ్మబోయారు


ఇది కూడా చదవండి : Adultery for Job Scam: మంచి ఉద్యోగం ఇప్పిస్తానని అమ్మాయిలను పిలిచి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook