Telangana exams: డిగ్రీ, బీటెక్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్
Degree, B.Tech exams 2020 | హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు సెమిస్టర్స్ పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతూ ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు.
Degree, B.Tech exams 2020 | హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు సెమిస్టర్స్ పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతూ ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. కరోనావైరస్ ( Coronavirus ) వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం వల్ల వైరస్ మరింత తీవ్రంగా వ్యాపిస్తుందని.. వైరస్ వ్యాప్తిని నివారించాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించకపోవడమే మేలు అని వెంకట్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
(Read also : Telangana: కరోనా పాజిటివ్ కేసుల లేటెస్ట్ హెల్త్ బులెటిన్ అప్‌డేట్స్ )
తెలంగాణలో హై కోర్టు తీర్పు ( TS High court) నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను నిర్వహించకుండానే విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసిన వెంకట్.. డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు సైతం అదే తరహాలో ప్రస్తుతానికి పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే విధంగా తెలంగాణ సర్కారుకు ఆదేశాలు జారీచేయాలని హై కోర్టుకు విజ్ఞప్తిచేశారు. ( Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు )
హైదరాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్ పరిధిలో కరోనావైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున.. ఈ ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షలు ( TS SSC exams) నిర్వహించొద్దంటూ హై కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయం డిగ్రీ, బీటెక్ పరీక్షలకు కూడా వర్తిస్తుందని.. జేఎన్‌టీయూహెచ్ (JNTU-H), ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU affiliated colleges) పరిధిలోని కాలేజీలు ఎక్కువగా గ్రేటర్ పరిధిలో ఉండటమే అందుకు కారణమని వెంకట్ కోర్టుకు తెలిపారు. డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు పరీక్షల నిర్వహణను సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో వాదనలు జరగనుండటంతో న్యాయస్థానం ఏమని స్పందిస్తుందా అనేదే ప్రస్తుతం విద్యార్థులకు ఉత్కంఠగా మారింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..