Exams amid lockdown | హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్రం లాక్ డౌన్ విధించిన కారణంగా డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా ( Degree, PG exams postponed) పడిన సంగతి తెలిసిందే. వీళ్లతో పాటే బీటెక్, ఎంటెక్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. దీంతో పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు ? కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అసలు పరీక్షలు నిర్వహించడం సాధ్యపడుతుందా లేదా అనే సందేహాలు విద్యార్థులను అప్పటి నుంచే వేధిస్తున్నాయి. ఇదిలావుండగా జూలై 1 నుంచి విశ్వవిద్యాలయాలు చివరి సంవత్సరం విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు పరీక్షలు నిర్వహించుకోవచ్చంటూ యూజీసీ ఇటీవలే మార్గదర్శకాలు సైతం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో యూజీ, పీజీ పరీక్షలను జూలై 1 నుంచి 20 లోపు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయమై ఈనెల 18న జరగనున్న ఉన్నతస్థాయి సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ( Telangana: కరోనావైరస్ వ్యాప్తి నివారణకు ముఖ్యమైన సమాచారం )
ఇదిలావుంటే, ఇటీవల 10వ తరగతి పరీక్షలను నిర్వహించాలని ప్రయత్నించిన తెలంగాణ సర్కారు.. హై కోర్టు అభ్యంతరాలు వ్యక్తంచేసిన కారణంగా ఆ ప్రయత్నాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఆ ప్రకారం చూస్తే.. డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణకు సైతం ఏమైనా కొత్త సవాళ్లు ఎదురుకావొచ్చా అనే విషయంలోనూ కొంత అయోమయం నెలకొంది. అప్పటితో పోలిస్తే... ఇప్పుడు ఏరోజుకు ఆ రోజు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూ వస్తోంది. ( Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు )
లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన అనంతరం జనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. అందువల్ల కరోనా మరింత వ్యాపించే ప్రమాదం ఉందని ఇప్పటికే శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో స్వయంగా ప్రభుత్వమే పేర్కొంది. ఈ నేపథ్యంలో డిగ్రీ, పీజీల పరీక్షల నిర్వహిస్తారా లేదా అనేదానిపైనే ప్రస్తుతం సందిగ్ధత కొనసాగుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం ఏంటనేది జూన్ 18న జరగనున్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలోనే ఓ స్పష్టత లభించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..