Modi in ICRISAT's Golden Jubilee Celebrations: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్‌ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో ప్రధాని పాల్గొననున్నారు. అలాగే పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో కూడా ప్రధాని మోదీ (PM Modi) పాల్గొంటారు. ప్రధాని టూర్‌‌కు సంబంధించిన ఫుల్ షెడ్యూల్ రిలీజైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ప్రధాని పర్యటన ఉండడంతో భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. ఎనిమిది వేల మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు.


ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్ట్‌కు స్పెషల్ ఫ్లైట్‌లో చేరుకుంటారు. ఇక మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలు దేరి.. పటాన్ చెరు ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ సెలబ్రేషన్స్‌ (ICRISAT's Golden Jubilee Celebrations) జరిగే వేదిక వద్దకు వస్తారు. 


తర్వాత మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ వేడుకల్లోనే ప్రధాని పాల్గొంటారు. 


సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు ఇక్రిశాట్‌ నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు హైదరాబాద్‌ (Hyderabad) హెలిప్యాడ్‌కు ప్రధాని చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి రోడ్‌ మార్గం గుండా బయల్దేరి.. సాయంత్రం 5 గంటలకల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామ నగరానికి ప్రధాని చేరుకుంటారు. 


సాయంత్రం 5 నుండి రాత్రి 8 వరకు రామానుజ సహస్రాబ్ది (Ramanujacharya Sahasrabdhi) వేడుకలలో ప్రధాని పాల్గొంటారు. అక్కడ పూజా కార్యక్రమాలు పాల్గొంటారు. అలాగే సమతామూర్తి విగ్రహాన్ని (Statue of Equality) ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. రాత్రి 8 గంటల 20 నిమిషాలకు శంషాబాద్‌ ఎయిర్‌‌ పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి రాత్రి 8 గంటల 40 నిమిషాలకు స్పెషల్‌ ఫ్లైట్‌లో ప్రధాని మోదీ (PM Modi) ఢిల్లీకి తిరిగి బయల్దేరుతారు.


Also Read: Asaduddin Owaisi: 'జెడ్​ సెక్యూరీటీ అవసరం లేదు.. ఏ క్యాటగిరీలోనే ఉంటా'


Also Read: IND vs WI: టీమిండియా ఖాతాలో అరుదైన ఘనత.. క్రికెట్ చరిత్రలో మొదటి జట్టుగా రికార్డు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook