PM Modi's YouTube Crosses 1 Crore Subscribers: సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ దూసుకుపోతున్నారు. నరేంద్ర మోదీ అధికారిక యూట్యూబ్ ఛానల్‌ను (PM Modi's YouTube Channel) సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారి సంఖ్య మంగళవారానికి కోటి దాటింది. ఈ ప్లాట్‌ఫాంలో అత్యధిక సభ్యత్వాలు కలిగి ఉన్న గ్లోబల్ లీడర్ల జాబితాలో (global leaders list) మోదీ అగ్రస్థానంలో ఉన్నారు.
మొత్తం 36 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లతో బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. 30.7 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లతో మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ మూడో స్థానంలో, 28.8 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లతో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నాలుగో స్థానంలో ఉన్నారు. వైట్‌హౌస్ అధికారిక ఛానల్‌కు 19 లక్షలమంది సబ్‌స్క్రైబర్లు ఉండగా..అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ( Joe Biden) కేవలం 7.03 లక్షల సబ్‌స్క్రైబర్‌లు మాత్రమే ఉండటం గమనార్హం.
జాతీయ నాయకులతో పోల్చినా.. ప్రధాని మోదీ (PM Modi) మెుదటి స్థానంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి 5.25 లక్షలు, మరో నేత శశి థరూర్‌కు 4.39 లక్షలు, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీకి 3.73 లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు 2.12 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. మరోవైపు ప్రధానికి ట్విటర్‌లో 7.53 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 4.68 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Also Read: Budget 2022: కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా ప్రాజెక్టుల డీపీఆర్ సిద్ధం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook