India to play 1000th ODI against West Indies: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వన్డే సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు 6, 9, 11 తేదీల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్నాయి. టాస్ మధ్యాహ్నం ఒంటి గంటకు పడనుండగా.. మ్యాచ్ 1.30కి ఆరంభం కానుంది. వెస్టిండీస్‌తో జరగనున్న టోయ్ వన్డే మ్యాచ్ టీమిండియాకు చాలా ప్రత్యేకం కానుంది.
వెస్టిండీస్‌తో ఆదివారం జరిగే తొలి వన్డేతో భారత జట్టు అరుదైన ఘనతను అందుకోనుంది. ఇది భారత జట్టుకు 1000వ వన్డే మ్యాచ్. ఈ మ్యాచ్ పూర్తయితే.. 1000 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెట్ దేశంగా భారత్ నిలవనుంది. క్రికెట్ చరిత్రలో ఇన్ని మ్యాచులు ఆడడం కేవలం భారత జట్టుకే సాధ్యమైంది. భారత్ తర్వాత 958 మ్యాచ్‌లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ 936 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉంది. మిగతా జట్లేవీ ఇంకా 900 మ్యాచ్‌లను కూడా పూర్తి చేసుకోలేదు.
ఇప్పటివరకు భారత్ 999 వన్డే మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 518 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. 431 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఇక ఇటీవల వన్డే కెప్టెన్‌గా నియమితుడైన రోహిత్ శర్మ టీమిండియా ఆడనున్న చరిత్రాత్మక 1000వ వన్డేకు సారథ్యం వహించి అరుదైన ఘనతను అందుకోనున్నాడు. అదృష్టం అంటే మానోడిదే మరి.
వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ రికార్డు నమోదు చేసే అవకాశం ఉంది. సొంతగడ్డపై 5 వేల పరుగుల మైలురాయిని అందుకునేందుకు కోహ్లీ 6 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు భారత గడ్డపై 5 వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ కూడా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనే సొంతగడ్డపై 5 వేల పరుగులు పూర్తి చేయడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook