Ponguleti Srinivas Reddy Political Plans: ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ నుండి జంప్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న పొంగులేటి పార్టీని వీడడంపై ఒక క్లారిటికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ మారడానికంటే ముందుగా తనకున్న ఆర్థిక బలాన్ని, ప్రజాబలాన్ని నిరూపించుకునేందుకు తన కూతురు పెళ్లి వేడుకను దేశం మొత్తం తన వైపు తిరిగి చూసేలా.. గాలి జనార్థన్ రెడ్డి తర్వాత మళ్లీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డే అనేలా అత్యంత గ్రాండ్‌గా నిర్వహించడమే అందుకు ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పొంగులేటికి పొలిటికల్ స్టార్‌‌డమ్ తెచ్చిన విజయం..  
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. ఖమ్మం జిల్లాలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు ముద్దుగా పొంగులేటి శీనన్న అని పిలుచుకుంటుంటారు. తెలంగాణలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండే అనతికాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్‌సీపీకి అప్పట్లో ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ.. ఆ ఇబ్బందులను అధిగమించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకున్న సత్తా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంతం. ప్రతికూల పరిస్థితుల మధ్యే విజయం సాధించిన ఘనుడిగా పొంగులేటి పేరు మార్మోగిపోయింది. ఈ ఎన్నికల్లో పొంగులేటి అంత తానై నడిపించి తాను ఎంపిగా గెలవడంతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. అది కూడా తనకంటే పొలిటికల్ సీనియర్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త నామా నాగేశ్వర రావును ఓడించారు. దీంతో పొంగులేటి పొలిటికల్ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అయితే రాష్ట్రంలో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలతో పొంగులేటి ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.


పొంగులేటికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిన సమయం..
టీఆర్ఎస్‌ పార్టీలో చేరిన తరువాత పార్టీలో పొంగులేటి క్రియాశీలకంగా పనిచేశారు. ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఎదిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. పార్టీ ఏ బాధ్యత ఇచ్చిన సమర్థవంతంగా నిర్వహించారు. తనకంటూ ఒక ప్రత్యేక క్యాడర్‌ను జిల్లాలో పొంగులేటి ఏర్పాటు చేసుకున్నారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సహకరించకుండా వారి ఓటమికి పొంగులేటి కారణం అయ్యారని జిల్లాలోని ఎమ్మెల్యే అభ్యర్థులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి సీఎం‌ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సమయం కోసం ఎదురు చూసిన సీఎం‌ కేసీఆర్ పొంగులేటికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపిగా ఉన్న పొంగులేటికి సీఎం మొండిచెయ్యి చూపారు. పొంగులేటిని పక్కకు పెట్టిన కేసీఆర్.. గతంలో పొంగులేటి చేతిలో ఓటమిపాలైన నామా నాగేశ్వర రావునే పార్లమెంట్ ఎన్నికల బరిలో దింపి అందరిని ఆశ్యర్యపరిచారు. ఇక అప్పటి నుండి పొంగులేటికి టీఆర్ఎస్‌లో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన అభిమానులు చెబుతున్నారు. 


[[{"fid":"242830","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Ponguleti-Srinivas-Reddy-photos.jpg","field_file_image_title_text[und][0][value]":"పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Ponguleti-Srinivas-Reddy-photos.jpg","field_file_image_title_text[und][0][value]":"పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి"}},"link_text":false,"attributes":{"alt":"Ponguleti-Srinivas-Reddy-photos.jpg","title":"పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి","class":"media-element file-default","data-delta":"2"}}]]


పొంగులేటిపై పెరిగిన అనుచరుల ఒత్తిడి..
పార్టీలో తమకు ప్రాధాన్యత తగ్గిపోతోందని గ్రహించిన ఆయన మద్దతుదారులు... చాలా సందర్భాల్లో టీఆర్ఎస్‌ను వీడాలని కోరినప్పటికీ పొంగులేటి మాత్రం పార్టీ మారే నిర్ణయం తీసుకోలేదు. సీఎం‌కేసీఆర్, కేటీఆర్‌ల సహకారంతో పార్టీలో భవిష్యత్ ఉంటుందని ఎప్పటికప్పుడు వారికి సర్థిచెప్పుకుంటూ వస్తున్నారు. అయితే జిల్లాలో పొంగులేటికి టీఆర్ఎస్ శ్రేణులు సహకరించడం లేదన్న ప్రచారం నడుస్తోంది. పొంగులేటి జిల్లాలో‌ నిర్వహించే కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు హాజరుకావొద్దంటూ స్వయంగా ప్రజాప్రతినిధులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై పొంగులేటి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తనకు జరుగుతున్న అవమానాలపై సీఎం కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినా.. ఎలాంటి ప్రయోజనం‌ లేదని పొంగులేటి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.


రైట్ టైమ్ కోసం వెయిట్ చేస్తోన్న పొంగులేటి..
ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయం రంజుగా మారింది. పార్టీల మధ్య, పార్టీలో అసంతృప్త నేతల మధ్య రాజకీయం తీవ్రస్థాయిలో హీటెక్కుతోంది. దీంతో మరోమారు తన సత్తా నిరూపించుకునేందుకు ఇదే సరైన సమయం అని భావించిన పొంగులేటి.. ఆ దిశగా అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. పొంగులేటిని నమ్ముకుని టీఆర్ఎస్‌లో కొనసాగుతున్న ఆయన అనుచరులు కూడా పార్టీ మారాలని పొంగులేటిపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే జిల్లాలో తనకున్న బలాన్ని నిరూపించేందుకునేందుకు పొంగులేటి ఇంట జరిగిన వివాహాన్ని వేదికగా చేసుకున్నట్లు తెలుస్తోంది. లక్షలాది మంది అతిథులను ఆహ్వానించి తన కూతురు వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు 7 లక్షల గోడ గడియారాలను కూడా జిల్లాలో పంపిణీ చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పొంగులేటి ఇంట జరిగిన వివాహాం చర్చకు దారితీసింది. ఈ వివాహా వేడుకల్లో ఎక్కువగా బిజెపి నేతల సందడి కనిపించింది. 


[[{"fid":"242828","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Ponguleti-Srinivas-Reddy-daughter-swapni-reddy-marriage-photos.jpg","field_file_image_title_text[und][0][value]":"పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు స్వప్ని రెడ్డి పెళ్లి ఫోటోలు"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Ponguleti-Srinivas-Reddy-daughter-swapni-reddy-marriage-photos.jpg","field_file_image_title_text[und][0][value]":"పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు స్వప్ని రెడ్డి పెళ్లి ఫోటోలు"}},"link_text":false,"attributes":{"alt":"Ponguleti-Srinivas-Reddy-daughter-swapni-reddy-marriage-photos.jpg","title":"పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు స్వప్ని రెడ్డి పెళ్లి ఫోటోలు","class":"media-element file-default","data-delta":"1"}}]]


బీజేపికి పొంగులేటి.. పొంగులేటికి బీజేపి.. పరస్పర సహకారం
ఇక రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారే అంశంపై మరోమారు చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్‌లో ప్రాధాన్యత లేకపోవడం, రాష్ట్రంలో బిజెపి బలపడే అవకాశాలు ఉండడంతో పొంగులేటి బిజెపి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పాదయాత్ర చేయాలన్న ఆలోచన కూడా పొంగులేటికి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని పార్టీ మారే అంశంపై కూడా పొంగులేటి ఒక క్లారిటికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోపక్క జిల్లాలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్న బిజెపికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉండడం కూడా కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా.. అతి కొద్ది రోజుల్లోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) పార్టీ మారే అంశంపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టమైన సమాచారం అందుతోంది.


Also Read : Bahubali Reception:100 ఎకరాలు.. 250 కోట్లు.. 3 లక్షల మంది అతిధులు! గాలిని తలదన్నేలా పొంగులేటి వేడుక


Also Read : Ponguleti Srinivas Reddy: టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాకిచ్చిన ఈటల.. బీజేపీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి


Also Read : Telangana Politics: ఏపీ సీఎం జగన్‌తో టీఆర్ఎస్ కీలక నేత చర్చలు.. కేసీఆర్ డైరెక్షన్ లోనే కలిశారా ?


Also Read : టీఆర్ఎస్‌లో కలకలం రేపుతున్న అసంతృప్త నేతల భేటీ.. జూపల్లి ఖమ్మం పర్యటన వెనుక మతలబు ఏంటి..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి