Telangana Politics: ఏపీ సీఎం జగన్‌తో టీఆర్ఎస్ కీలక నేత చర్చలు.. కేసీఆర్ డైరెక్షన్ లోనే కలిశారా?

Telangana Politics: హాట్ హాట్ గా సాగుతున్న తెలంగాణ రాజకీయాల్లో రోజుకో కీలక పరిణామం వెలుగుచూస్తోంది. ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో సమావేశం కావడం ఆసక్తిగా మారింది.

Written by - Srisailam | Last Updated : Jul 15, 2022, 10:15 AM IST
Telangana Politics: ఏపీ సీఎం జగన్‌తో టీఆర్ఎస్ కీలక నేత చర్చలు.. కేసీఆర్ డైరెక్షన్ లోనే కలిశారా?

Telangana Politics: హాట్ హాట్ గా సాగుతున్న తెలంగాణ రాజకీయాల్లో రోజుకో కీలక పరిణామం వెలుగుచూస్తోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారంతో దూకుడు పెంచిన పార్టీలు సర్వేలు నిర్వహించుకుంటున్నాయి. పలు ప్రైవేట్ సంస్థలు కూడా తెలంగాణ జనం నాడి పట్టే ప్రయత్నం చేస్తున్నాయి. వరుసగా వెలువడుతున్న సర్వేలు తెలంగాణ రాజకీయాలకు హీటెక్కిస్తున్నాయి. ఒక్కో సర్వేలో ఒక్కో ఫలితం వస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే కొద్ది అధికార టీఆర్ఎస్ పార్టీ ప్లస్ అవుతుందనే మెజార్టీ సర్వేలో వస్తోంది. తెలంగాణలో వలసల పర్వం జోరుగా సాగుతోంది. రాత్రికి రాత్రే కొందరు లీడర్లు జంప్ అవుుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కీలక పరిణామం జరిగింది.

ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో సమావేశం కావడం ఆసక్తిగా మారింది. ఖ‌మ్మం నుంచి అమరావతి వెళ్లిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ను కలిశారు. ఇద్దరు కలిసి కాసేపు చర్చలు జరిపారు. పొంగులేటి టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఆయన పార్టీ మారుతానే చర్చ చాలా కాలంగా సాగుతోంది. బీజేపీ నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపారనే వార్తలు వచ్చాయి. బీజేపీ కాదు కాంగ్రెస్ ముఖ్యనేతలతో పొంగులేటి టచ్ లో ఉన్నారనే టాక్ బయటికి వచ్చింది. కాని పొంగులేటి మాత్రం పార్టీ మార్పు వార్తలను ఖండిస్తూ వస్తున్నారు. ఇటీవలే ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పొంగులేటి నివాసానికి వెళ్లారు. అక్కడే లంచ్ చేశారు. చాలా సేపు పొంగులేటితో ఏకాంతగా మాట్లాడారు కేటీఆర్. దీంతో పొంగులేటి టీఆర్ఎస్ లోనే కొనసాగుతారని అంతా భావించారు.

ఖమ్మం ఎంపీ సీటు కాకుండా కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగులేటీ పోటీ చేయాలనుకుంటున్నారని.. కేటీఆర్ ఆ సీటుపై ఆయన హామీ ఇచ్చారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే కేటీఆర్ పొంగులేటిని కలిసిన కొన్ని రోజుల్లో ఖమ్మం జిల్లాలో కీలక ఘటనలు జరిగాయి. పొంగులేటి అనుచరుడిగా ఉన్న అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాడి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పొంగులేటి మరో అనుచరుడు పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా టీఆర్ఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఆయన కూడా పార్టీ మారడం ఖాయమని అంటున్నారు. పొంగులేటి అనుచరులంతా కారు పార్టీకి గుడ్ బై చెప్పడం ఖమ్మం జిల్లాలో చర్చగా మారింది. పొంగులేటి డైరెక్షన్ లోనే తాటి, పాయం పయనిస్తున్నారని.. పొంగులేటి కూడా పార్టీ జంప్ అవుతారనే ప్రచారం మళ్లీ జోరుగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పొంగులేటి అమరావతి వెళ్లి సీఎం జగన్ తో సమావేశం కావడం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది.

2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఖమ్మం ఎంపీగా గెలిచారుపొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం జిల్లాలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. తర్వాత అందరూ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జగన్ సూచనతోనే పొంగులేటి కారు పార్టీ గూటికి చేరారని అప్పుడు ప్రచారం జరిగింది. గత నెలలో కూడా ఏపీ సీఎం జగన్ ను కలిశారు. దీంతో పొంగులేటి వరుసగా జగన్ ను ఎందుకు కలుస్తున్నారన్నది ఆసక్తిగా మారింది. పొంగులేటి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ నుంచి పోటీ చేస్తారా లేక సీఎం జగన్ ఆయన ఏమైనా ఆఫర్ ఇచ్చారా.. వ్యాపార పనుల కోసమే కలిశారా అన్న చర్చలు సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే జగన్ ను పొంగులేటి కలిశారనే వాదనలు వస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకట ఓటు చీలితే టీఆర్ఎస్ లాభం ఉంటుందని సర్వేల్లో స్పష్టమవుతోంది. దీంతో పొంగులేటి జగన్ కు కలవడం వెనుక గులాబీ పార్టీ పెద్దలు ఉండవచ్చనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.

Read also: Telangaan Floods:కాళేశ్వరం బ్యారేజీకి రివర్స్ వరద.. కంట్రోల్ రూమ్ లో చిక్కుకుపోయిన 105 మంది సిబ్బంది

Read also:  Godavari Floods: నీటమునిగిన భద్రాచలం.. ధవళేశ్వరంలో చివరి ప్రమాద హెచ్చరిక! గోదావరి తీర ప్రాంతాలు కకావికలం..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

 

Trending News