PRC Report In Telangana: ఇటీవల తమకు వేతన సవరణ సంఘం (Telangana Pay Revision Commission) సమర్పించిన నివేదికను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుందని తెలుస్తోంది. కొన్ని రోజుల తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా ఉద్యోగులకు జీతాల పెంపు, పదవీ విరమణ వయసు పెంపులాంటి కీలక అంశాలపై మాట్లాడారు. అదే సమయంలో నిరుద్యోగులకు ఊరట కలిగించే ప్రకటన సైతం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


నేడు వేతన సవరణ సంఘం (Pay Revision Commission) నివేదికను తెలంగాణ(Telangana) సర్కార్ విడుదల చేయనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. పీఆర్‌సీ నివేదికను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నారని సమాచారం. వేతన సవరణ సంఘం ఫిట్‌మెంట్‌ను 15 శాతం కంటే తక్కువగానే సిఫార్సు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలు మాత్రం పీఆర్‌సీ నివేదికపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి.
Also Read: Singareni Jobs: సింగరేణిలో 372 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల, వివరాలు



సీఎం కేసీఆర్(Telangana CM KCR) చెప్పినట్లుగానే.. ఉద్యోగ పదవీ విరమణ వయసును రెండేళ్ల పెంపుదలకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అంటే 58 నుంచి 60కి పదవీ విరమణ వయసును పెంచనున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన త్రిసభ్య కమిటీ నేడు పీఆర్సీ నివేదిక విడుదలైన తరువాత నుంచి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది.


Also Read: IBPS PO Mains Admit Card: ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్ కోసం క్లిక్ చేయండి



కాగా, మరోవైపు నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వీరికి ఫిబ్రవరి నెల నుంచి తెలంగాణలో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని, ఈ మేరకు ఆర్థికశాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఇటీవల సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయడం తెలిసిందే.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook