గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( Greater Hyderabad municipal corporation ) ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నట్టే...ఎన్నికల కమీషన్ సంసిద్ధమవుతోంది. తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తోంది. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నిక ( Dubbaka Bypoll ) పోలింగ్ ముగిసింది. ఇక కౌంటింగ్ ప్రక్రియే మిగిలుంది. ఇక మరో ప్రధాన ఘట్టంపై అటు రాజకీయపార్టీలు ఇటు ఎన్నికల కమీషన్ సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( GHMC ) ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపధ్యంలో ఎన్నికల కమీషన్ నుంచే కీలక ప్రకటన విడుదలైంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను సిద్ధమవుతోంది. ఓటర్ల జాబితా ప్రచురించిన అనంతరం గ్రేటర్ హైదరాాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముందని తెలంగాణ ఎన్నికల కమీషనర్ పార్ధసారధి తెలిపారు. 


ఎన్నికల ప్రక్రియలో రిటర్నింగ్ అధికారి పార్టీ కీలకమైందని..పారదర్శకంగా , నిష్పక్షపాతంగా, ఎన్నికల నిబంధనావళిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు  ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహక ప్రక్రియ మొదలైన‌ట్టు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రచురణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. ఈ నెల 7వ తేదీలోగా ముసాయిదా ఓటర్ల జాబితా జారీ అవుతుందన్నారు. ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు జాబితాపై అభ్యంతరాల్ని స్వీకరించనున్నారు. తుది జాబితా ఈనెల 13న వెలువరించనున్నారు. తుది జాబితా ప్రచురించిన తరువాత ఎప్పుడైనా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయవచ్చన్నారు. Also read: Dharani Portal: వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరించొద్దు: హైకోర్టు


ఎన్నికల నియమ నిబంధనలు, ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనల్ని అర్దం చేసుకునే అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి బాధ్యత రిటర్నింగ్ అధికారిదేనన్నారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పోలింగ్ సిబ్బంది నియామకంకు సంబంధించి ప్రతి పనిని పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల స్వీకరణ నుంచి మొదలుకుని ఫలితాలు వెలువడేవరకూ తీసుకోవల్సిన చర్యలు, చేయాల్సిన బాధ్యతలకు సంబంధించి చెక్ లిస్ట్ తయారు చేసుకోవాలన్నారు. ఇక ఎన్నికల నియమావళి కాపీల్ని అన్ని రాజకీయపార్టీలు, అభ్యర్ధులకు అందించడమే కాకుండా అమలయ్యేలా చూడాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 150 వార్డులు, 30 సర్కిళ్లు ఉన్నాయని, ఒక్కో సర్కిల్‌కు ఒక డిప్యూటీ కమిషనర్ ఉన్నారని చెప్పారు.


ఎన్నికల నోటిఫికేషన్ ( Election Notification ) వెలువరించే విషయంలో రాష్ట్ర ఎన్నికల కమీషన్ ( State Election commissioner )  నుంచి ప్రకటన రావడంతో రాజకీయపార్టీలు సన్నద్ధమవుతున్నాయి. Also read: Medchal Railway Station: మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో బోగీలకు మంటలు