Medchal Railway Station: మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో బోగీలకు మంటలు

Fire accident at Medchal Railway Station: హైదరాబాద్ : నగర శివార్లలోని మేడ్చ‌ల్ రైల్వేస్టేష‌న్‌లో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం అగ్నిప్ర‌మాదం ( Fire accident ) చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో పక్కకు నిలిపి ఉంచిన‌ 10 బోగీలలో రెండు బోగీలకు మంట‌లు అంటుకున్నాయి ( Train coaches caught fire ). అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు.

Last Updated : Nov 3, 2020, 05:18 PM IST
Medchal Railway Station: మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో బోగీలకు మంటలు

Fire accident at Medchal Railway Station: హైదరాబాద్ : నగర శివార్లలోని మేడ్చ‌ల్ రైల్వేస్టేష‌న్‌లో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం అగ్నిప్ర‌మాదం ( Fire accident ) చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో పక్కకు నిలిపి ఉంచిన‌ 10 బోగీలలో రెండు బోగీలకు మంట‌లు అంటుకున్నాయి ( Train coaches caught fire ). అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అంతకంటే ముందుగా మంటలు ఒక బోగీ నుంచి మరో బోగి వ్యాపించడంతో అక్కడంతా దట్టమైన పొగ అలుముకుంది. రైల్వే స్టేషన్‌లోనే ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో అక్కడున్న ప్రయాణికులు, స్థానికులు ఏం జరుగుతుందో అర్థం కాక  కాసేపు ఆందోళనకు గురయ్యారు. Also read : Dharani Portal: వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరించొద్దు: హైకోర్టు

Fire-accident-in-railway-coaches-at-Medchal-Railway-Station

రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే ( South Central Railway ) సీపీఆర్పో సీహెచ్ రాకేశ్ మాట్లాడుతూ.. ''రెండు బోగీలకు నిప్పంటుకుందని, ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయి'' అని అన్నారు. Also read : Dubbaka Bypoll Fake Votes: తన ఓటు ఎవరో వేశారని అసలు ఓటర్ ఆందోళన

Fire-accident-in-railway-coaches-at-Medchal-Railway-Station

అగ్ని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలను తెలుసుకునే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నమైనట్టు రాకేష్ తెలిపారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News